ఎంబీబీఎస్, బీడీఎస్‌తో పాటు మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్ -యూజీ 2021 ప్రవేశపరీక్షా ఫలితాలను విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ).. 16,14,777 మంది ఈ టెస్ట్ కోసం దరఖాస్తు చేసుకోగా 15,44,275 మంది పరీక్షకు హాజరయ్యారు.. వారిలో 8,70,074 మంది అర్హత సాధించినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫలితాలను విడుదల చేసింది.. ఈ ఫలితాల్లో తెలంగాణకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది.. తెలంగాణకు చెందిన మృణాల్ కుటేరి, ఢిల్లీకి చెందిన తన్మయ్‌గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తిక్ నాయర్ మొదటి సాధించారు.. సమాన మార్కులు వచ్చిన అందరికీ ఒకే ర్యాంకు ప్రకటించింది ఎన్టీఏ.. ఇక, తెలంగాణకు చెందిన మరో విద్యార్థి ఖండవల్లి శశాంక్‌కు కూడా జాతీయ స్థాయిలో 5వ ర్యాంక్ వచ్చింది.. మహిళల టాప్ 20లో జాతీయ స్థాయిలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు కాస లహరి (30 వ ర్యాంక్), ఈమని శ్రీనిజ (38వ ర్యాంక్) సాధించారు. ఇక, పరీక్ష ఫైనల్ కీ, స్కోర్ కార్డులను కూడా వెబ్‌సైట్‌లో పెట్టింది ఎన్టీఏ.
నీట్ ఫలితాలు విడుదల.. తెలంగాణ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్
