NTV Telugu Site icon

Covid 19: దేశంలో 5 వేలను దాటిన రోజూవారీ కోవిడ్ కేసులు..

Covid 19

Covid 19

Covid 19: దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 5,335 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. గత రోజుతో పోలిస్తే 20 శాతం అధికంగా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 25,587 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత సెప్టెంబర్ 23 తర్వాత తొలిసారిగా కేసుల సంఖ్య 5 వేలను దాటింది. ప్రస్తుతం రోజూవారీ పాజిటివిటీ రేటు 3.32 శాతంగా ఉంది.

Read Also: Kakani Govardhan Reddy: పబ్లిసిటీ కోసమే కోటంరెడ్డి హంగామా.. నాలుగేళ్లలో గుర్తుకు రాలేదా?

యాక్టివ్ కేసులు మొత్తం కేసుల సంఖ్యలో 0.06 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,826 రికవరీలు నమోదు అయ్యాయి. కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి కోవిడ్ బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,82,538కి చేరుకుంది. గత కొన్ని రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో కేంద్ర రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ.. ఐసీయూలు, ఆక్సిజన్ సరఫరా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఢిల్లీలో కొత్తగా 509 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. పాజిటివిటీ రేటు 26.54 శాతానికి చేరుకుంది. ఇది దాదాపుగా 15 నెలల్లో అత్యధికం. ఇటీవల పెరుగున్న కేసులపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్ని ఏర్పాట్లను చేసినట్లు వెల్లడించారు.