NTV Telugu Site icon

Lok Sabha Deputy Speaker: లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పోస్టు కూడా ఎన్డీయేకే.. ప్రతిపక్షాలకు దెబ్బ..

Lok Sabha Deputy Speaker

Lok Sabha Deputy Speaker

Lok Sabha Deputy Speaker: లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ముగిసింది. 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా స్పీకర్ పదవి కోసం అధికార, ప్రతిపక్షాలు పోటీ పడ్డాయి. చివరకు బీజేపీ ఎంపీ ఓం బిర్లా స్పీకర్‌గా ఎన్నికయ్యారు. రెండోసారి ప్రతిష్టాత్మక పదవిని చేపట్టారు. సాధారణంగా ఏకాభిప్రాయంతో అధికార, ప్రతిపక్షాలు స్పీకర్‌ని ఎంపిక చేస్తూ రావడం సాంప్రదాయంగా ఉంది. అయితే, ఈ సారి డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని ప్రతిపక్ష ఇండీ కూటమి డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ పదవికి పోటీని నిలిపింది.

Read Also: Warangal: రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ రివ్యూ..!

ఇదిలా ఉంటే, నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి, రెండు పర్యాయాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవిని ఈ సారి భర్తీ చేయనున్నారు. సంప్రదాయానికి భిన్నంగా ప్రతిపక్షానికి కాకుండా ఈ సారి ఈ పదవిని ఎన్డీయే కూటమి అంటిపెట్టుకునే అవకాశం ఉంది. దీంతో అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య మరింత వాగ్వాదం చెలరేగే అవకాశం కనిపిస్తోంది.

గతంతో పోలిస్తే ఈ సారి బీజేపీ మిత్రపక్షాలైన తెలుగుదేశం, నితీష్ కుమార్ జేడీయూ, షిండే శివసేన పార్టీలపై ఎక్కువగా ఆధారపడింది. స్పీకర్ ఎన్నిక ముందు మిత్రపక్షాలు స్పీకర్ పోస్టును కోరినప్పటికీ, బీజేపీ ఈ పదవి ఇచ్చేందుకు ఇష్టపడలేదు. ఈసారి డిప్యూటీ స్పీకర్ పదవి మిత్రపక్షాలుకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.