NTV Telugu Site icon

Nayab Singh Saini: హర్యానా బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నేతగా నయాజ్ సింగ్ సైనీ.. రేపు సీఎంగా ప్రమాణం..

Nayab Singh Saini

Nayab Singh Saini

Nayab Singh Saini: హర్యానా బీజేపీ శాసనపక్ష నేతగా నయాబ్ సింగ్ సైనీని ఎంపికయ్యారు. అక్టోబర్ 17 అంటే రేపు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. హర్యానాకు రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. కేంద్రమంత్రులు అమిత్ షా, మనోహర్ లాల్ కట్టడ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలంతా నయాబ్ సింగ్ సైనీని తమ నేతగా ఎన్నుకున్నారు.

Read Also: Bahraich Violence : బహ్రైచ్ హింసలో ఇప్పటివరకు 50 మంది అరెస్టు.. కొనసాగుతున్న ఇంటర్నెట్ బంద్

హర్యానా బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిగా ఎంపికైన తర్వాత, నయాబ్ సింగ్ సైనీ మాట్లాడుతూ, “హర్యానా ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ విధానాలపై విశ్వాసం ఉంచారు, మూడవసారి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు తీర్మానించారు.2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రధాని మోదీ దార్శనికతను ముందుకు తీసుకెళ్తాం’’ అని అన్నారు.

ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. వరసగా మూడోసారి అధికారంలోకి రాబోతోంది. మొత్తం 90 స్థానాల్లో బీజేపీ ఏకంగా 48 చోట్ల గెలిచింది. హర్యానాలో విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌కి మరోసారి అడియాసే ఎదురైంది. ఆ పార్టీ కేవలం 37 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. బీజేపీ సొంతగా మ్యాజిక్ ఫిగర్ 46ని క్రాస్ చేసింది. ప్రస్తుతం ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు తెలపడంతో బీజేపీ బలం 51కి చేరింది.