Site icon NTV Telugu

జవాన్ ను హతమార్చిన మావోయిస్టులు…

ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లా ఏప్రిల్ 28న జవాన్ మనోజ్ నేతమ్ ,ను అపహరించుకు పోయిన మావోయిస్టులు,జవాన్ మనోజ్ ను హత్య చేసినట్లు ధృవీకరించారు.ఈ ఘటనకు సంబంధించి ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేసారు.ఐతే మనోజ్ మృతదేహాన్ని అనివార్య కారణాల వల్ల కుటుంబ సభ్యులకు చేరవేయనందుకు చింతిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.ఐతే కరోనా మహమ్మారి దండకారణ్యం లో ఇప్పటికే విలయతాండవం చేస్తున్నదనే వార్తలు వస్తున్నాయి.పలు చోట్ల కరోనా చోకిన మావోలు చికిత్స కోసం మైదాన ప్రాంతానికి రావటం, కొంతమంది పోలీసులు ఎదుట లొంగిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి, ప్రజాకోర్టు నిర్వహించిన అనంతరం మెజారిటీ పీపుల్ తీర్పు మేరకు శిక్షలు ఖరారు చేసి మరణం శిక్ష ఐతే ,హత్య చేసిన అనంతరం సమీప గ్రామంలో పులి మేరలో బాడీని పడవేసి గ్రామస్తుల ద్వారానో లేక పోలీసుల వేగుల ద్వారా పోలీసులకు సమాచారం అందుతుంది.కానీ ఈ కరోనా కారణంగా ప్రజలు ప్రజాకోర్టుకు హాజరయ్యే అవకాశం తక్కువ కావటం, గ్రామస్తులు సైతం ప్రత్యేక ఐసోలేషన్ లు అటవీప్రాంతంలో ఏర్పాటు చేసుకుని వుండటం . ఇప్పుడు ఆ అటవీ ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ నేపథ్యంలో జవాన్ మృతదేహాన్ని ఇవ్వకపోవడానికి కారణం ఏంటనేది మావోలు లేఖలో తెలుపలేదు, దీంతో పలు అనుమానాలకు దారి తీస్తుంది.

Exit mobile version