Site icon NTV Telugu

Maoist Attack : ఛత్తీస్‌ఘడ్‌లో నక్సల్స్ దుశ్చర్య

రోజురోజుకు మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో మావోయిస్టుల దాడులు పెరిగిపోతున్నాయి. గత కొంతకాలంగా మావోయిస్టుల తమ ఉనికి కాపాడుకోవడానికి నిత్యం దాడులు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌ఘడ్‌లో నిన్న రాత్రి నక్సల్స్ దుశ్చర్యకు పాల్పడ్డారు. అర్ధరాత్రి పోలీస్ క్యాంప్‌పై మావోయిస్టులు దాడికి తెగబడ్డారు. కిస్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోత్కపల్లి క్యాంపుపై ఒక్కసారిగా మావోలు దాడి దిగారు.

దీంతో అప్రమత్తమైన జవాన్లు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపారు. జవాన్ల కాల్పులలో పలువురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. పోలీస్ క్యాంపుపై దాడికి పాల్పడింది పీఎల్ జీఏ 1 వ బెటాలియన్ మావోయిస్టు పార్టీ సభ్యులుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Exit mobile version