Site icon NTV Telugu

Gujarath: ఏందిరా మాకు దరిద్రం.. నవరాత్రి ఉత్సవాల్లో కూడా అలాంటి పనులేంట్రా…

Untitled Design (2)

Untitled Design (2)

చాలా సంవత్సరాలుగా, నవరాత్రి వల్ల కండోమ్‌ల అమ్మకాలు పెరుగుతున్నాయని కంపెనీలు ప్రకటిస్తున్నాయి. . 2016లో నవరాత్రి నృత్య వేదికలకు దగ్గరగా ఉన్న ఫార్మసీలు, కెమిస్టులలో కండోమ్ అమ్మకాలు సగటున 25-50 శాతం పెరుగుతాయని పేర్కొంది. దాదాపు అందరూ ఈ సమయంలో కండోమ్‌లు ,గర్భనిరోధకాల అమ్మకాలు పెరుగుతాయని ఫార్మసీలు ధృవీకరించాయి. అయితే ఈ సారి ఏకంగా 18 రెట్లు పెరిగిందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఎంత వరకు నిజమనే విషయంపై క్లారిటీ లేదు.

నవరాత్రుల సందర్భంగా గుజరాత్ లో గార్భా, దాండియా డ్యాన్స్ లు భారీగా నిర్వహిస్తున్నారు ఆర్గనైజర్లు. నవరాత్రుల్లో ముఖ్యంగా గుజరాత్‌లో గార్బా, దాండియా డ్యాన్స్ ఈవెంట్స్ పెద్ద మొత్తంలో జరుగుతాయి. ముఖ్యంగా యువకులు రాత్రంతా డ్యాన్స్ చేసేందుకు అక్కడికి చేరుకుంటారు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా బయటకు వెళ్లేందుకు యువతకు అవకాశం దొరకడంతో.. వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. దీంతో కండోమ్ సేల్స్ ఈ టైంలో పెరిగిపోతున్నట్లుగా కొన్నేళ్లుగా కంపెనీలు ప్రకటిస్తూనే ఉన్నాయి.

పైగా ఈ మధ్య ఈ ఈవెంట్స్‌ టికెట్‌ మీద రన్ అవుతున్నాయి. ఇందులో పాల్గొనేందుకు రెండు వేల నుంచి 15వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. మనీ మింటింగ్ మెషిన్స్‌గా ఉన్న ఈ బిజినెస్ కాస్త డ్యాన్స్‌తోనే ఆగడం లేదనేది సత్యం. కాగా సేఫ్ కోసం కండోమ్స్ వాడుతున్నారు. ఇదే కండోమ్ సేల్స్ పెరిగేందుకు అబార్షన్ కేసులు ఎక్కువయ్యేందుకు కారణం అవుతోందని సమాచారం.

Exit mobile version