NTV Telugu Site icon

వైర‌ల్‌: సిద్ధూ స్టైలే వేరు.. కెప్టెన్‌‌ ముందే సిక్స్ బాది..!

Navjot Singh Sidhu

న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ స్టైలే వేరు.. ఈ టీమిండియా మాజీ క్రికెట‌ర్‌కు సిక్స‌ర్ల సిద్ధూగా పేరు ఉండ‌గా.. ఇప్పుడు త‌న ప‌నిలోనూ.. ఆ సిక్స‌ర్ల‌ను గుర్తు చేస్తున్నారు.. ఏకంగా స్టేజ్‌పైనే సిక్స‌ర్ బాదిన‌ట్టు పోజులు ఇచ్చారు.. ఇప్పుడు ఆ వీడియో వైర‌ల్‌గా మారిపోయింది.. స్టేట్‌పైన సిద్ధూ సిక్స్ కొట్ట‌డం ఏంట‌నే విష‌యానికి సంబంధించిన పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. పంజాబ్ కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ.. ఆ త‌ర్వాత 62 మంది ఎమ్మెల్యేల‌తో బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న కూడా చేశారు.. ఇక‌, సిక్స్ విష‌యానికి వ‌స్తే.. కాంగ్రెస్ భ‌వ‌న్‌లో పంజాబ్ పీసీసీ చీఫ్‌గా సిద్ధూ ప్ర‌మాణం స్వీకారం చేశారు.. ఆ కార్య‌క్ర‌మానికి పంజాబ్ సీఎం కెప్టెన్‌ అమ‌రీంద‌ర్ సింగ్ కూడా హాజ‌ర‌య్యారు.. ఇక‌, ప్ర‌మాణ స్వీకారం చేయాల్సిందిగా త‌న పేరును పిల‌వ‌గానే.. సిద్ధూ నిజంగానే బ్యాటింగ్ చేయ‌డానికి వెళ్తున్న‌ట్లుగా వామ‌ప్ చేస్తూ కుర్చీలో నుంచి లేచారు.. ఆ త‌ర్వాత సిక్స‌ర్ షాట్ ఆడుతున్న‌ట్లుగా చేతులు ఊప‌డంతో.. అక్క‌డ కాంగ్రెస్ శ్రేణులు, ఆయ‌న అభిమానులు కేరింత‌లు కొట్టారు..

కాగా, పంజాబ్‌లో వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా.. సీఎం అమ‌రీంద‌ర్ సింగ్, సిద్ధ మ‌ధ్య తీవ్ర‌మైన విభేదాలు వ‌చ్చాయి.. కాంగ్రెస్ అధిష్టానం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ.. ఇలా అంతా రంగంలోకి దిగి ఆ విభేదాలు చెక్ పెట్టే ప్ర‌య‌త్నాలు చేశారు.. అటు సిద్ధూతో.. ఇటు అమ‌రీంద‌ర్ సింగ్‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు.. ఆ త‌ర్వాత సిద్ధూను పంజాబ్ పీసీసీ చీఫ్‌గా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

https://twitter.com/ANI/status/1418471091530473476?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1418471091530473476%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fnational%2Fnavjyoth-singh-sidhu-mimics-a-sixer-shot-at-his-punjab-pcc-chief-swearing-in-ceremony-151111%2F