Women have more intercourse partners than men in 11 states/UTs: పురుషుల కన్నా మహిళలే ఎక్కువ సెక్స్ పార్ట్నర్స్ కలిగి ఉన్నారని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో తేలింది. 11 రాష్ట్రాలు, యూటీల్లో పురుషుల కన్నా స్త్రీలే సగటున ఎక్కువ మంది సెక్స్ భాగస్వాములను కలిగి ఉన్నట్లు తేలింది. అయితే జీవితభాగస్వామి కాకుండా ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకున్న పురుషుల శాతం 4 శాతంగా ఉంది. ఇది మహిళల కన్నా 0.5 శాతం ఎక్కువగా ఉందని ఫ్యామిలీ హెల్త్ సర్వేలో తేలింది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 1.1 లక్షల మంది మహిళలను, 1 లక్ష మంది పురుషులతో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువగా సెక్స్ భాగస్వాములను కలిగి ఉన్నారని తేలింది. ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను పరిశీలిస్తే రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, జమ్మూ మరియు కాశ్మీర్, లడఖ్, మధ్యప్రదేశ్, అస్సాం, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా సెక్స్ పార్ట్నర్స్ ని కలిగి ఉన్నారని తేలింది.
Read Also: Chandoo Mondeti : అమితాబ్ బచ్చన్‌తో ‘కార్తికేయ’ దర్శకుడు..
సగటున 3.1 సెక్స్ భాగస్వాములను స్త్రీలు కలిగి ఉంటే.. పురుషులు 1.8 సెక్స్ భాగస్వాములను కలిగి ఉన్నారని సర్వేలో తేలింది. అయితే సర్వే నిర్వహించడానికి ఏడాది ముందు కాలంలో పురుషులు తమ భార్య, లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న మహిళతో కాకుండా ఇతరులతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్న పురుషుల శాతం 4గా ఉంది. ఇది మహిళ కన్నా 0.5 శాతం అధికం. 2019-21లో నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 దేశంలోని 28 రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లోని 707 జిల్లాల్లో సర్వే చేసింది. సామాజిక-ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తోంది.
