NTV Telugu Site icon

Heeraben Modi Passed away: నరేంద్రమోడీకి మాతృ వియోగం.. మోడీ తల్లి హీరాబెన్ మోడీ మృతి

Pm Narendra Modi mother

Pm Narendra Modi Mother Turns 100 16555206844x3

ప్రధాని నరేంద్రమోడీకి మాతృవియోగం కలిగింది. మాతృమూర్తి హీరాబెన్ మోడీ కన్నుమూశారు. ఆమె వయసు 100 ఏళ్ళు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు హీరాబెన్ మోడీ. అయితే  గురువారం ఆమె కోలుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అస్వస్థత నుంచి కోలుకుంటున్నట్లు యూఎన్ మెహతా ఆసుపత్రి గురువారం రాత్రే ప్రకటించింది. అయితే కొద్దిగంటల్లోనే ఈవిషాదం వినాల్సి వచ్చింది.

ఆమె అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమెను బుధవారం ఈ ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న మోదీ హుటాహుటిన ఈ ఆసుపత్రిని సందర్శించి, తన తల్లితో మాట్లాడారు. దాదాపు గంటన్నర సేపు ఆమె వద్ద ఉన్నారు. అనంతరం న్యూఢిల్లీ వెళ్ళారు. హీరాబెన్‌ను ఒకట్రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి ఇంటికి పంపిస్తారని బీజేపీ నేతలు భావించారు. అయితే హఠాత్తుగా ఆమె మరణించారన్న వార్త మోడీని తీవ్రవిషాదంలో నింపేసింది.

హీరాబెన్ మోడీ ఆకస్మిక మృతికి పలువురు సంతాపం తెలిపారు. ప్రధాని మోడీకి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.ఈ ఏడాది జూన్‌లో హీరాబెన్‌ శతవసంతంలోకి అడుగుపెట్టారు. ఇటీవల గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన ఆమె ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు. పోలింగ్‌కు ముందు మోదీ తన తల్లిని కలిసి ఆమెతో కొంత సమయం గడిపారు. ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. మరోవైపు.. మోడీ సోదరుడు ప్రహ్లాద్‌ మోడీ కుటుంబం మంగళవారం కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రహ్లాద్‌ మోడీకి స్వల్ప గాయాలయ్యాయి.

ప్రధాని మోడీ తన తల్లి మరణం గురించి తెలియజేస్తూ ప్రధాని ట్వీట్‌ … ఉద్వేగ భరిత ట్వీట్ చేసిన మోడీ

Read Also:S5 No Exit Movie Review: ఎస్ 5

Show comments