Maha kumbh mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో జరగబోతున్న మహా కుంభ మేళాకి అంతా సిద్ధమైంది. ఇప్పటికే, యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. మహా కుంభమేళా జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. అయితే, ఈ కుంభమేళాలో హిందూయేతర మతస్తులు షాపులు పెట్టుకోవడంపై వివాదం నడుస్తోంది. ఈ వివాదంపై అఖిల భారతీయ అఖాడా పరిషత్ చీఫ్ మహంత్ రవీంద్ర పూరి మాట్లాడారు. కుంభమేళాలో ‘‘మతాన్ని భ్రష్టు పట్టించే’’ దుకాణాలను ముస్లింలు పెట్టుకోవద్దని అన్నారు. ముస్లింలు మాకు సహోదరులే, వారితో ఎలాంటి శత్రుల్వం లేకపోయినా, మహాకుంభమేళాల వారు మన మతాన్ని దుర్వియోగపరిచేలా షాపులు పెట్టకూడదని పూరీ అన్నారు. జ్యూస్ షాపులు, ఫుడ్ స్టాల్స్, టీ దుకాణాలు నడిపేవారు ఉద్దేశపూర్వకంగా ఉమ్మివేస్తారని ఆరోపించారు.
Read Also: Delhi: భార్య వేధింపులకు మరొకరు బలి.. తుపాకీతో కాల్చుకుని న్యాయవాది ఆత్మహత్య
మరోవైపు మహా కుంభ్ సన్నాహాల్లో హిందూ-ముస్లిం ఐక్యతకు కొన్ని ఉదాహరణలు చెప్పారు. మహా కుంభమేళాలో నిరంజని అఖాడా యొక్క కంటోన్మెంట్ ప్రవేశంలో ముస్లిం బ్యాండ్‌లను చేర్చారని అన్నారు. ఇక అఖిల భారతీయ అఖాడా పరిషత్ మఠాన్ని నిర్మించిన కాంట్రాక్టర్ కూడా ముస్లిమేనని చెప్పారు. మహా కుంభమేళా ఉత్సవాల్లో పాల్గొనడం తనకు దక్కిన గొప్ప అదృష్టమని కంటోన్మెంట్ ఎంట్రీలో చేర్చిన ఆజాద్ బ్యాండ్ యజమాని ఇక్బాల్ అహ్మద్ అన్నారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు రాబోతున్నారు.