Site icon NTV Telugu

Madhyapradesh Minister: ముస్లింలకు విగ్రహారాధనపై విశ్వాసం ఉంటే గర్బాను సందర్శించవచ్చు

Usha Thakur

Usha Thakur

Madhyapradesh Minister: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో గర్బా పండాల్లోకి ప్రవేశించడానికి గుర్తింపు కార్డులు అవసరమని వారం రోజుల కిందటే చెప్పిన మధ్యప్రదేశ్ మంత్రి ఇప్పుడు విగ్రహారాధనపై విశ్వాసం ఉంటే గర్బాను సందర్శించవచ్చన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న “లవ్ జిహాద్” సంఘటనల దృష్ట్యా మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ ఒక హెచ్చరిక జారీ చేశారు. పాల్గొనే వారందరూ ఇప్పుడు గార్బా వేదికలలోకి ప్రవేశించడానికి తప్పనిసరిగా గుర్తింపు రుజువును కలిగి ఉండాలని చెప్పారు. ఇప్పుడు ముస్లింలు తమ పవిత్ర గ్రంథం విగ్రహారాధనకు అనుమతిస్తే వారిని గర్బా పండళ్ల వద్ద స్వాగతిస్తామని చెప్పారు.

అలాగే విగ్రహారాధనలో విశ్వాసం ఉన్న ముస్లిం పురుషులు తమ మహిళా కుటుంబ సభ్యులతో కలిసి వస్తేనే గార్బా వేదికల వద్దకు స్వాగతం పలుకుతారని మంత్రి తెలిపారు. అంతకుముందు ఆమె గ్వాలియర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. లవ్ జిహాద్‌కు గర్బా పండళ్లు మాధ్యమంగా మారాయన్నారు. గర్బా అనేది తొమ్మిది రోజుల హిందూ పండుగ నవరాత్రి సందర్భంగా ప్రదర్శించబడే సాంప్రదాయ నృత్యం. “లవ్ జిహాద్‌కు గార్బా పండళ్లు ప్రధాన మాధ్యమంగా మారాయని సాధారణంగా ప్రజలకు తెలుసు. అందుకే ఎవరూ తన గుర్తింపును దాచిపెట్టి గర్బా పండల్‌లోకి ప్రవేశించకుండా చూసుకోవాలనుకుంటున్నాము.” అని మంత్రి ఉషా ఠాకూర్ వెల్లడించారు.

Maharashtra: దేవేంద్ర ఫడ్నవీస్ భార్యపై ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు.. మహిళ అరెస్ట్

“లవ్ జిహాద్” అనేది కొన్ని రాడికల్ హిందూ గ్రూపులు ఉపయోగించే పదం. ముస్లిం పురుషులు తరచుగా వివాహం ద్వారా హిందూ స్త్రీలను మోసం చేసి వారిని ఇస్లాం మతంలోకి మార్చడానికి ప్రయత్నిస్తారని సూచిస్తున్నారు. కొత్త మతమార్పిడి నిరోధక చట్టం ప్రకారం, మతాంతర జంటలు వివాహం చేసుకునే ముందు జిల్లా అధికారికి రెండు నెలల నోటీసు ఇవ్వాలి. అంతకుముందు, 2014లో, ఎమ్మెల్యే ఠాకూర్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, ఆమె ముస్లింలను గర్బాకు హాజరుకాకుండా అడ్డుకోవాలని కోరుతూ వివాదాన్ని రేకెత్తించింది. ఆమె తన నియోజకవర్గంలోని అన్ని గర్బా నిర్వాహకులకు లేఖ రాయడంతోపాటు ముస్లిం పురుషులను నృత్య ఆచారంలో పాల్గొనకుండా నిషేధించాలని, మహిళలతో సంభాషించకుండా కూడా వారిని ఆపాలని కోరింది. ప్రతి సంవత్సరం గర్బా సమయంలో నాలుగు లక్షలకు పైగా హిందూ బాలికలు ఇస్లాం మతంలోకి మారుతున్నారని ఆమె పేర్కొంది, అయితే ఆమె వాదనలను ధృవీకరించడానికి అధికారిక గణాంకాలు లేవు.

Exit mobile version