Site icon NTV Telugu

Murshidabad Violence Report: హిందువులు టార్గెట్‌, సహాయం చేయని పోలీసులు.. ముర్షిదాబాద్ వక్ఫ్ అల్లర్లు..

Murshidabad Violence Report

Murshidabad Violence Report

Murshidabad Violence Report: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో తీవ్రమైన హింస చెలరేగింది. అయితే, ఈ హింసపై కలకత్తా హైకోర్టు ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటి నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. గత నెలలో జరిగిన ఈ ముర్షిదాబాద్ ఘర్షణలు హిందువులను లక్ష్యంగా చేసుకున్నాయని, హింసలో బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారని పేర్కొంది. సహాయం కోసం పిలిచినప్పటికీ పోలీసులు స్పందించడంలో విఫలమైనట్లు నివేదిక తెలిపింది.

Read Also: AP Cabinet Meeting: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 500 ఎకరాలు.. అమరావతిలో లా యూనివర్సిటీ!

విచక్షణారహితంగా దహనం చేయడం, దోపిడీలు, దుకాణాలు, మాల్స్‌ని నాశనం చేయడాన్ని నివేదిక హైలెట్ చేసింది. స్థానిక కౌన్సిలర్ మెహబూబ్ ఆలం ఈ దాడులకు నాయకత్వం వహించాడని, పోలీసులు పూర్తిగా మౌనంగా ఉన్నారని నివేదిక పేర్కొంది. ప్రధాన దాడి జరిగిన ఏప్రిల్ 11 శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత, స్థానిక కౌన్సిలర్ మెహబూబ్ ఆలం దుండగులతో వచ్చారని, బెట్‌బోనా గ్రామంలో 113 ఇళ్లు అత్యంత ప్రభావితమైనట్లు నివేదిక తెలిపింది. కలకత్తా హైకోర్టు నియమించిన దర్యాప్తు బృందంలో జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర న్యాయ సేవల అధికారం మరియు న్యాయ సేవల సభ్యులు ఉన్నారు. ఈ నివేదికను నేడు హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు సమర్పించారు.

Exit mobile version