NTV Telugu Site icon

Delhi: రాష్ట్రపతి భవన్‌లో టీచర్స్ డే వేడుకలు.. అవార్డులు అందుకున్న తెలుగు రాష్ట్రాల టీచర్లు వీరే!

Delhi

Delhi

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో టీచర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందజేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డులు అందుకున్నారు.

ఇది కూడా చదవండి: Teachers Day 2024: లోకం మెచ్చిన గురువులు వీళ్లే..

రాష్ట్రపతి చేతుల మీదుగా తెలుగు రాష్ట్రాల ఉపాధ్యాయులు అవార్డులు అందుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఐదుగురు ఉపాధ్యాయులకు రాష్ట్రపతి అవార్డులు అందజేశారు. ఏపీ నుంచి సురేష్ కునాటి, మిద్దె శ్రీనివాస్ రావు, తెలంగాణ నుంచి ముగ్గురు ఉపాధ్యాయులకు అవార్డులు అందాయి. తాడూరి సంపత్ కుమార్, పీసర ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ నందవరం మృదుల బాబు అవార్డులు అందుకున్నారు.

ఇది కూడా చదవండి: Cloves benefits: లవంగాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!

Show comments