Mumbai: ర్యాలీతో భారీ ట్రాఫిక్ జామ్.. మంత్రిని రప్ఫాడించిన మహిళ.. వీడియో వైరల్
- ముంబైలో బీజేపీ నిరసన ర్యాలీ
- భారీగా నిలిచిపోయిన వాహనాలు
- గంటల తరబడి రోడ్లపై ఆగిపోయిన ప్రజలు
- మంత్రిని నిలదీసిన మహిళ.. వీడియో వైరల్
దేశంలో ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ లాంటి మహా నగరాలు నిత్యం వాహనాలు, ప్రజల రాకపోకలతో రద్దీగా ఉంటాయి. ఇక ఉదయం స్కూళ్లకు వెళ్లే సమయాల్లో.. ఇంటికెళ్లే సమయాల్లో అయితే నరకమే కనిపిస్తుంది. పైగా దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. అలాంటిది ముంబై లాంటి మహా నగరంలో మంత్రి గిరీష్ మహాజన్ భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి ప్రజలు రోడ్లపై నిలిచిపోయారు. దీంతో ఒక మహిళకు కోపం కట్టలు తెంచుకుంది. నేరుగా మంత్రిగా దగ్గరకు వెళ్లి వాగ్వాదం పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేం ఏం జరిగిందంటే..
ఇటీవల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లులు ప్రవేశపెట్టింది. అయితే బిల్లులపై కేంద్రం కుట్రపన్నిందన్న ఆలోచనతో ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. దీంతో బిల్లులు వీగిపోయాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విపక్షాల తీరుకు నిరసనగా ఎన్డీఏ నేతలు నిరసనలు చేపట్టారు.
ఇందులో భాగంగా మంగళవారం ముంబైలోని వర్లీలో బీజేపీ నిరసన ర్యాలీ చేపట్టింది. మంత్రి గిరీష్ మహాజన్ నేతృత్వంలో ర్యాలీ జరుగుతోంది. వర్లీ ప్రాంతం నిత్యం రద్దీగా ఏరియా. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అత్యవసర పనుల నిమిత్తం వెళ్లే వాళ్లంతా రోడ్లపై ఆగిపోయారు. దీంతో ఓ మహిళ తీవ్ర అసౌకర్యానికి గురైంది. వెంటనే మంత్రి దగ్గరకు వెళ్లి ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని.. మీ వల్ల ఇంత పెద్ద ట్రాఫిక్ ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఏదైనా నిరసనలు ఉంటే మైదానాల్లోకి వెళ్లి చేసుకోవాలి గానీ.. ఇలా రోడ్లపై చేయడమేంటి? అని నిలదీసింది. ఇంతలో అక్కడే ఉన్న ఒక పోలీస్.. ఆమెను పక్కకు తీసుకెళ్లి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో బీజేపీకి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ నేత హర్షవర్ధన్ సప్కల్ వీడియోను షేర్ చేసి.. అధికార పార్టీ రాజకీయ లబ్ధి కోసం మహిళా బిల్లును వాడుకుంటుందని విమర్శించారు. ఇక మహారాష్ట్ర మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటేల్ కూడా విమర్శించారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగించే ఇలాంటి పనులు చేయడం భావ్యం కాదన్నారు.
'GET OUT' Watch this woman absolutely dismantle the ego of BJP MLA & Minister Girish Mahajan. 🔥🔥 pic.twitter.com/kl0pzXdOti
— Shraddha (슈라다) (@HuhVsWorld) April 21, 2026
తాజావార్తలు
-
Mumbai: ర్యాలీతో భారీ ట్రాఫిక్ జామ్.. మంత్రిని రప్ఫాడించిన మహిళ.. వీడియో వైరల్
-
Ponnam Prabhakar: ఆర్టీసీ సోదరులారా సమ్మె విరమించండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి
-
144Hz రిఫ్రెష్ రేట్, 13.2 అంగుళాల డిస్ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!
-
GV Prakash: జీవి ప్రకాష్ హీరోగా జో డైరెక్టర్ మూవీ
-
The Paradise: అనిరుధ్ నెక్స్ట్ సాంగ్ అప్డేట్ అదిరిపోయిందిగా!
ట్రెండింగ్
-
50MP+50MP+50MP కెమెరాలు, IP68/IP69 రేటింగ్, వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో నేడు లాంచ్ కానున్న Motorola Edge 70 Pro.!
-
Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!