Mumbai: ర్యాలీతో భారీ ట్రాఫిక్ జామ్.. మంత్రిని రప్ఫాడించిన మహిళ.. వీడియో వైరల్
- ముంబైలో బీజేపీ నిరసన ర్యాలీ
- భారీగా నిలిచిపోయిన వాహనాలు
- గంటల తరబడి రోడ్లపై ఆగిపోయిన ప్రజలు
- మంత్రిని నిలదీసిన మహిళ.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ లాంటి మహా నగరాలు నిత్యం వాహనాలు, ప్రజల రాకపోకలతో రద్దీగా ఉంటాయి. ఇక ఉదయం స్కూళ్లకు వెళ్లే సమయాల్లో.. ఇంటికెళ్లే సమయాల్లో అయితే నరకమే కనిపిస్తుంది. పైగా దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. అలాంటిది ముంబై లాంటి మహా నగరంలో మంత్రి గిరీష్ మహాజన్ భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి ప్రజలు రోడ్లపై నిలిచిపోయారు. దీంతో ఒక మహిళకు కోపం కట్టలు తెంచుకుంది. నేరుగా మంత్రిగా దగ్గరకు వెళ్లి వాగ్వాదం పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేం ఏం జరిగిందంటే..
ఇటీవల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లులు ప్రవేశపెట్టింది. అయితే బిల్లులపై కేంద్రం కుట్రపన్నిందన్న ఆలోచనతో ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. దీంతో బిల్లులు వీగిపోయాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విపక్షాల తీరుకు నిరసనగా ఎన్డీఏ నేతలు నిరసనలు చేపట్టారు.
Also Read
ఇందులో భాగంగా మంగళవారం ముంబైలోని వర్లీలో బీజేపీ నిరసన ర్యాలీ చేపట్టింది. మంత్రి గిరీష్ మహాజన్ నేతృత్వంలో ర్యాలీ జరుగుతోంది. వర్లీ ప్రాంతం నిత్యం రద్దీగా ఏరియా. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అత్యవసర పనుల నిమిత్తం వెళ్లే వాళ్లంతా రోడ్లపై ఆగిపోయారు. దీంతో ఓ మహిళ తీవ్ర అసౌకర్యానికి గురైంది. వెంటనే మంత్రి దగ్గరకు వెళ్లి ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని.. మీ వల్ల ఇంత పెద్ద ట్రాఫిక్ ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఏదైనా నిరసనలు ఉంటే మైదానాల్లోకి వెళ్లి చేసుకోవాలి గానీ.. ఇలా రోడ్లపై చేయడమేంటి? అని నిలదీసింది. ఇంతలో అక్కడే ఉన్న ఒక పోలీస్.. ఆమెను పక్కకు తీసుకెళ్లి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో బీజేపీకి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ నేత హర్షవర్ధన్ సప్కల్ వీడియోను షేర్ చేసి.. అధికార పార్టీ రాజకీయ లబ్ధి కోసం మహిళా బిల్లును వాడుకుంటుందని విమర్శించారు. ఇక మహారాష్ట్ర మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటేల్ కూడా విమర్శించారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగించే ఇలాంటి పనులు చేయడం భావ్యం కాదన్నారు.
'GET OUT' Watch this woman absolutely dismantle the ego of BJP MLA & Minister Girish Mahajan. 🔥🔥 pic.twitter.com/kl0pzXdOti
— Shraddha (슈라다) (@HuhVsWorld) April 21, 2026
తాజావార్తలు
-
YS Jagan: చంద్రబాబు అభివృద్ధి ప్రచారం ఉత్తదే.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ విమర్శలు..
-
Haldiram IPO: స్టాక్ మార్కెట్లోకి ‘హల్దీరామ్’ గ్రాండ్ ఎంట్రీ.. ఏకంగా రూ. 10 వేల కోట్ల భారీ ఐపీఓకు రంగం సిద్ధం!
-
Rasgulla bomb: రసగుల్లా అని నోట్లో పెట్టుకుని కొరికాడు.. బాంబు పేలి వ్యక్తి మృతి..
-
Anaswara Rajan: ఆ బ్యూటీకి రామ్ చరణ్ స్పెషల్ బూస్ట్! కొత్త సినిమాతో జాతకం మారేనా..
-
Civils Candidates: సివిల్స్ ఇంటర్వ్యూ అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!