NTV Telugu Site icon

Mumabi: నూడిల్స్ లో టొమాటోను కలిపి తిన్నందుకు మహిళ మృతి

Maggi Noodles

Maggi Noodles

Woman Eats Noodles Tomatoes, Dies: పరధ్యానంలో ఉంటూ పనులు చేస్తుంటే.. ఫలితాలు ఎలా ఉంటాయనే దానికి ఉదాహరణ ఈ సంఘటన. చేసే చిన్న తప్పులే ప్రాణాలను మీదికి తీసుకువస్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కూడా తీస్తాయి. ముంబైలో జరిగిన ఘటన అందర్ని షాక్ కు గురిచేస్తోంది. ముంబైకి చెందిన ఓ మహిళ న్యూడిల్స్ టమాటాను కలిపి తింది.. దీంతో ఆమె మరణించింది. సాధారణంగా టొమాటోను నూడిల్స్ కలిపి తింటే చనిపోతారా..? అనే ప్రశ్న అందరికి రావచ్చు.. అయితే ఆ మహిళ మాత్రం ఎలుకను చంపేందుకు టోమాటోలో విషం పెట్టింది. ఈ విషయాన్ని మరిచి అదే టొమాటోను న్చూడిల్స్ వేసి వండింది. ఇది తిని చనిపోయింది.

Read Also: COVID 19: దేశంలో 20 వేలకు పైగా కేసులు.. పెరిగిన మరణాలు

ముంబైకి చెందిన 27 ఏళ్ల మహిళ.. నూడిల్స్ తయారు చేస్తుండగా, ఎలుకలు విషం పెట్టిన టొమాటోను పొరపాటున న్యూడిల్స్ వేసి వండింది. ఈ ఘటన ముంబైలోని మలాడ్ లోని పాస్కల్ వాడి ప్రాంతంలో చోటు చేసుకుంది. రేఖ నిషాద్ అనే మహిళ జూలై 21న ఇంట్లో ఎలుకను చంపేందుకు టొమాటోలో విషం కలిపింది. మరుసటి రోజు న్యూడిల్స్ తయారు చేసే క్రమంలో.. టీవీ చూస్తూ ఎలుకల విషం పెట్టిన సంగతి మరిచి అదే టొమాటోను న్యూడిల్స్ వేసింది. దీంతో నూడల్స్ తిన్న సదరు మహిళకు కొన్ని గంటల్లోనే వాంతులు చేసుకోవడం ప్రారంభించింది. ఆమె భర్త, బావ సమీప ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. ప్రమాదవశాత్తు విషం కలిసిన టొమాటోను న్యూడిల్స్ లో కలపడం వల్లే మరణించిందని..మాల్వాని పోలీస్ ఇన్‌స్పెక్టర్ మూసా దేవర్షి వెల్లడించారు.

Show comments