NTV Telugu Site icon

Donald Trump: ట్రంప్ రాకతో బంగ్లాదేశ్‌లో అసలు “గేమ్” ప్రారంభం కానుందా..?

Sheikh Hasina

Sheikh Hasina

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడంతో బంగ్లాదేశ్‌లో అసలు గేమ్ ప్రారంభం కాబోతోంది. ట్రంప్ గెలిచిన వెంటనే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, తనను ప్రధానిగా పేర్కొంటూ శుభాకాంక్షలు చెప్పింది. ఈ పరిణామం ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వానికి క్లియర్ మేసేజ్‌గా చెప్పవచ్చు. నిజానికి ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ ట్రంప్‌కి గతం నుంచి గ్యాప్ ఉంది. ట్రంప్‌ని గట్టిగా విమర్శించే వ్యక్తుల్లో మహ్మద్ యూనస్ ఒకరు.

మహ్మద్ యూనస్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న జోబైడెన్ నేతృత్వంలోని డెమెక్రాట్ పార్టీకి చాలా సన్నిహితుడు. క్లింటన్, కమలా హారిస్‌కి అత్యంత ఆప్తుడుగా పరిగణించబడుతున్నాడు. నిజానికి ప్రధాని షేక్ హసీనాను పారిపోయేలా చేసింది, గద్దె దిగేలా చేసింది జోబైడెన్ ప్రభుత్వమే అనే అపవాదు కూడా ఉంది. అమెరికన్ డీప్ స్టేట్ ప్లాన్‌లో భాగంగానే బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం, హింసాత్మక సంఘటలు ప్రారంభమయ్యాయనే ఆరోపణ ఉంది.

Read Also: Devaki Nandana Vasudeva: వెనక్కి తగ్గిన ‘దేవకీ నందన వాసుదేవ’

ఇదిలా ఉంటే, ఇటీవల దీపావళి సెలబ్రేషన్స్‌లో డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నాడు. హిందువులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోత గురించి మాట్లాడుతూ, తీవ్రంగా ఖండించాడు. ఇలా మోడీ తర్వాత ఒక ప్రపంచ స్థాయి నేత హిందువుల గురించి మాట్లాడిన రెండో వ్యక్తిగా ట్రంప్ నిలిచారు. ప్రస్తుతం ట్రంప్ గెలవడం బంగ్లాలోని తాత్కాలిక ప్రభుత్వం, ముఖ్యంగా మహ్మద్ యూనస్‌కి చిక్కులు తెచ్చి పెట్టింది.

గతంలో 2016లో ట్రంప్ గెలిచిన సందర్భంలో మహ్మద్ యూనస్ మాట్లాడుతూ.. ట్రంప్ విజయం మమ్మల్ని తీవ్రంగా దెబ్బతీసింది, నేను మాట్లాడలేకపోతున్నాను, నేను శక్తిని కోల్పోయానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చూస్తే ట్రంప్‌పై యూనస్‌కి ఎంత ద్వేషం ఉందో అర్థం అవుతుంది.వీటికి తోడు ట్రంప్, మోడీల మధ్య ఉన్న స్నేహం కూడా షేక్ హసీనాకు కలిసి వచ్చే అవకాశం ఉంది. షేక్ హసీనా అధికారంలో ఉన్న సమయంలో భారత్‌కి బంగ్లాదేశ్ పూర్తి సహకారాన్ని అందించింది. భారత ఆసక్తులకు ప్రాధాన్యత ఇచ్చింది. రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ రాజకీయాలు మారే అవకాశం కనిపిస్తోంది. షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్ వెళ్లినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

Show comments