Site icon NTV Telugu

Madhya Pradesh: నది నుంచి చెప్పులు తీయడానికి ప్రయత్నించి, ప్రాణాలు పోగొట్టుకున్నాడు..

Madhya Pradesh

Madhya Pradesh

Madhya Pradesh: మధ్యప్రదేశ్ సియోని జిల్లాలో దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. నదిలో నుంచి చెప్పులు తీసేందుకు ప్రయత్నించిన 20 ఏళ్ల వ్యక్తి, అందులో జారిపడి కొట్టుకుపోయాడు. అతడి స్నేహితులు చూస్తుండగానే నీటిలో మునిగిపోయాడు. సరదాగా పిక్నిక్ వెళ్లిన సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సోమవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: Rummy in Assembly: అసెంబ్లీలో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కిన మంత్రి.. వీడియో వైరల్..

బాధిత యువకుడిని ఆయుష్‌గా గుర్తించారు. ఆయుష్ అతడి స్నేహితులతో కలిసి పరేవా ఖో అనే ప్రసిద్ధ ప్రదేశానికి విహారయాత్రకు వెళ్లాడు. ఆసమయంలో నదిలో అతడి చెప్పు కొట్టుకుపోయింది. దీనిని తిరిగి తీసే క్రమంలో ఆయుష్, ఒక కర్రను ఉపయోగించి నీటిలోకి అడుగు పెట్టాడు. కొట్టుకుపోతున్న చెప్పును కర్రతో ఆపాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో అతను జారిపోవడంతో బ్యాలెన్స్ కోల్పోయి నదిలో పడిపోయాడు. మరుసటి రోజు రెస్క్యూ టీం ఆయుష్ మృతదేహాన్ని తెలికి తీసింది.

Exit mobile version