లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సోదరి ప్రియాంకాగాంధీ కేరళలోని వయనాడ్‌లో పర్యటించారు. గురువారం ఇద్దరు కలిసి ప్రకృతి విలయం సృష్టించిన చూరల్‌మలలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో కలియ తిరిగారు. అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే బాధిత కుటుంబాలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
జూలై 30న వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి దాదాపు 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే వందలాది మంది గల్లంతయ్యారు. ఇంకొందరు తీవ్ర గాయాలు పాలయ్యారు. వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక సహాయక బృందాలు రంగంలోకి శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో పడ్డారు.
ఇక ఆస్పత్రుల్లో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి.. బంధువులకు అప్పగించే పనిలో అధికారులు ఉన్నారు. అలాగే ఆస్పత్రులకు బంధువులు తరలివస్తున్నారు. ఇంకోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కేరళలో పరిస్థితుల్ని చక్కిదిద్దుతున్నారు.