Site icon NTV Telugu

Rudraprayag Rain: భారీ వర్షాల కారణంగా విరిగిపడ్డ కొండచరియలు.. 13 మంది గల్లంతు

Rudraprayag Rains

Rudraprayag Rains

Rudraprayag Rain: రుద్రప్రయాగ్‌లోని గౌరీకుండ్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి.. కేదార్‌నాథ్ యాత్ర ప్రధాన స్టాప్‌ వద్దనున్న రెండు షాప్‌లపై దూసుకొచ్చాయి. ఈ దెబ్బకు ఆ రెండు షాప్‌లు పూర్తిగా కూలిపోయాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో.. వాటిల్లో చాలామంది నిద్రిస్తున్నారు. అందుకే, ఈ ప్రమాదాన్ని వాళ్లు పసిగట్టలేకపోయారు. ఈ ఘటనలో 13 మంది గల్లంతు అవ్వగా, ఇంకా చాలామంది ఈ శిథిలాల కింద ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసి.. NDRF, SDRF బృందాలు వెంటనే రంగంలోకి దిగి.. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కానీ.. ఎడితెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో.. రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

Wind Chimes at Home: ఇంట్లో ఈ దిశలో విండ్ చైమ్ ఉంటే.. 24 గంటల్లో అద్భుతం జరుగుతుంది!

ఈ ఘటనపై ఒక అధికారి మాట్లాడుతూ.. భారీ వర్షాల దెబ్బకు కొండచరియలు విరిగిపడి, రెండు షాప్‌లపై పడ్డాయని అన్నారు. ఆ దుకాణాలు పూర్తిగా కూలిపోగా.. అందులో నిద్రిస్తున్న జనాలు శిథిలాల కింద ఇరుక్కుపోయారని, మరో 13 మంది గల్లంతయ్యారని అన్నారు. గల్లంతైన వారిలో నేపాల్, స్థానిక ప్రజలు ఉన్నారన్నారు. మరోవైపు.. వర్షం కారణంగా మందాకిని నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బాగేశ్వర్, నైనిటాల్, చంపావత్ జిల్లాలకు గురువారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో.. మూడు జిల్లాల్లోనూ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. ఇదే సమయంలో.. డెహ్రాడూన్, హరిద్వార్, పౌరీ, ఉధమ్ సింగ్ నగర్‌లలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

TS MBBS Web Options 2023: నేటి నుంచే ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లకు వెబ్‌ ఆప్షన్లు!

Exit mobile version