NTV Telugu Site icon

Elephant Fights Off Crocodile: బిడ్డను రక్షించడానికి మొసలితో ఏనుగు పోరాటం.. వీడియో వైరల్..

Elephant Fights Off Crocodile

Elephant Fights Off Crocodile

Elephant Fights Off Crocodile: బిడ్డను రక్షించాల్సి వస్తే తల్లులు ఎందాకైనా వెళ్లారు. ఇది ఒక మానవులకే పరిమితం కాలేదు. జంతువులు కూడా తన పిల్లలను రక్షించుకోవడానికి ఎందాకైనా వెళ్తాయని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఓ గున్న ఏనుగును మొసలి బారి నుంచి తల్లి ఏనుగు పోరాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీన్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘‘ఏనుగు తన బిడ్డను రక్షించుకోవడానికి ఎంతవరకైనా వెళ్తాయి. చివరికి మొసలి లొంగిపోవాల్సి వచ్చింది’’ అంటూ ట్విట్టర్ లో రాశారు.

Read Also: Imran Khan: పాక్ ఆర్మీ చీఫ్ పై ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలు.. మోస్ట్ పవర్ ఫుల్ పర్సన్ అంటూ..

ఓ పిల్ల ఏనుగు బురద నీటిలో ఉన్న సమయంలో అకాస్మత్తుగా ఓ భారీ మొసలి నీటి నుంచి వచ్చి దాడి చేసింది. తల్లి ఏనుగు మొసలిపైకి దూసుకెళ్లి, దానిని తొక్కేసి, పారిపోయేలా చేసింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 51,000 మంది చూశారు, 1,308 లైక్స్ వచ్చాయి. చాలా మంది నెటిజన్లు అమ్మ ప్రేమను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది తల్లిని దేవుడితో పోల్చారు.

ఒక నెటిజన్.. ‘‘మొసలి రక్షించబడింది, లేకపోతే దాని లోపల ఉన్న మొత్తం బయటకు వచ్చేది’’ అని వ్యాఖ్యానించారు. మరొకరు మొసలి తప్పించుకున్నా కూడా తన పిల్లను రక్షించుకోవడానికి ఇంకా తల్లి ఏనుగు చెరువులో వెతుకుతూనే ఉందని, ఇది తల్లి పిల్లల రక్షణ పట్ల ఉన్న ప్రవృత్తి అన్నారు.

Show comments