NTV Telugu Site icon

Suicide In India: యువతకు ఏమైంది..? భారత్‌లో పెరిగిన ఆత్మహత్యలు..

Suicide In India

Suicide In India

Suicide In India: ఇతర దేశాల కంటే భారతదేశంలో ఎక్కువ మంది యవత ఆత్మహత్యకు పాల్పడుతున్నారని మంగళవారం ‘‘ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం’’ సందర్భంగా నిపుణులు చెప్పారు. అవగాహన పెంచడానికి ప్రతీ ఏడాది సెప్టెంబర్ 10న ప్రపంచ ఆరోగ్య నివారణ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది థీమ్ ‘‘ఆత్మహత్యపై కథనాన్ని మార్చాలి’’. భారతదేశంలో కౌమారదశ( 15-19 ఏళ్లు) యువతలో ఆత్మహత్యలు, మరణాలకు నాలుగో ప్రధాన కారణం అవుతున్నాయని అంచనా వేశారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం.. ఆత్మహత్యలకు పాల్పడే కేసుల్లో 40 శాతానికి పైగా 30 ఏళ్ల లోపు యువతే ఉంటోంది.

“భారతదేశంలో, దురదృష్టవశాత్తు ఆత్మహత్యల ద్వారా మరణించే యువకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. గ్లోబల్ యావరేజ్‌తో పోలిస్తే భారత్‌లో ఆత్మహత్య చేసుకున్న యువకుల సంఖ్య దాదాపు రెట్టింపు. భారతదేశంలో రోజుకు సుమారు 160 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ”అని ఎయిమ్స్‌లోని సైకియాట్రీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ నంద్ కుమార్ చెప్పారు.

Read Also: Haryana Polls: బీజేపీ రెండో జాబితా విడుదల.. 21 మంది అభ్యర్థుల ప్రకటన

ఒత్తిడితో కూడిన కుటుంబ వాతావరణం, అస్థిర భావోద్వేగాలు, రిలేషన్స్ విఫలం కావడం, స్నేహితుల మధ్య బలహీనమైన బంధం, ఒంటరితనం అనేవి యువతలో ఆత్మహత్యలని ప్రేరేపించి మరణాలకు కారణమవుతున్నాయి. ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం..2022లో 1.71 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ‘‘15 నుంచి 39 ఏళ్ల వయసు గల వ్యక్తుల మరణాలకు ప్రధాన కారణం ఆత్మహత్య. ప్రపంచవ్యాప్తంగా, మనదేశంలో మనం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన ప్రజారోగ్య సంక్షోభాల్లో ఒకటి’’ అని లైవ్‌లవ్‌లాఫ్ యొక్క సైకియాట్రిస్ట్ మరియు చైర్‌పర్సన్ డాక్టర్ శ్యామ్ భట్ చెప్పారు.

ఆత్మహత్యల రేటుని తగ్గించడానికి ఎక్కువ అవగాహన, సంరక్షణ, అంతర్లీన సామాజిక ఆర్థిక సమస్యలను పరిష్కరించడం చాలా అవసరమని, మానసిక ఆరోగ్యంతో పోరాడుతున్న వారికి దయతో అక్కున చేర్చుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. మనస్తలి వ్యవస్థాపక-డైరెక్టర్ మరియు సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ జ్యోతి కపూర్ మాట్లాడుతూ మానసిక ఆరోగ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి మరియు ఆత్మహత్యలను నివారించడానికి ప్రభుత్వం నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ మరియు కిరణ్ హెల్ప్‌లైన్ వంటి కార్యక్రమాలను ప్రారంభించిందని అన్నారు.