మాఘి పూర్ణిమ సందర్భంగా మహా కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు 73 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఇంకా లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈరోజు ప్రత్యేక మైన రోజు కావడంతో లక్షలాదిగా తరలివస్తున్నారు.
ఇది కూడా చదవండి: Moinabad Farm House: ఫామ్‌హౌస్‌లో కోడిపందేలు, క్యాసినో నిర్వహణ.. 64 మంది అరెస్ట్!
మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యూపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. ఇంకోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ స్వయంగా పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఇటీవల జరిగిన దుర్ఘటనలు తిరిగి జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడే పోలీసులు మోహరింపజేశారు. ఇదిలా ఉంటే ప్రయాగ్‌రాజ్‌లో ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాగున్నాయంటూ కితాబు ఇస్తున్నారు. మహా కుంభమేళా ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు కొనసాగనుంది.
ఇది కూడా చదవండి: Chiranjeevi : ‘‘లేడీస్ వార్డెన్ లెక్క అయిపోయింది.. చరణ్ వారసుడిని ఇవ్వరా’’ వైరల్ అవుతున్న చిరు వ్యాఖ్యలు