Mohan Bhagwat: దుబాయ్ నుంచి ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఘటన నుంచి 174 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ సాహసాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసించారు. ఇతరు ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టిన ఆయన ధైర్యం, తరతరాలుగా వస్తున్న ఆయన హిందుత్వ విలువలకు నిదర్శనమని అన్నారు.
నాగ్‌పూర్‌లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వార్షిక దసరా ప్రసంగంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. హిందూ సమాజ దృక్ఫథం, స్వభావం సమ్మిళతమైందని, ఇటువంటి విలువలు సమాజంలో భావోద్వేగ ఐక్యత, పరస్పర సద్భావన, మంచి ప్రవర్తనను బలోపేతం చేస్తాయని అన్నారు.
భారతీయుల మధ్య ఐక్యత హృదయాల్లో పాతుకుపోయిందని, అది ఎలాంటి షరతులపై ఆధారపడదని ఆయన అన్నారు. పరస్పర అనుబంధం, ఆప్యాయత, సొంతవారే భావనతో ఏర్పడే సంబంధాలు షరతులకు అతీతంగా ఉంటాయని చెప్పారు. సమాజంలో హిందూ విలువల్ని మెల్కొలిపి, సమిష్టిగా పనిచేసే క్రమశిక్షణతో కూడిన సమాజాన్ని నిర్మించేందుకు ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందని ఆయన అన్నారు.

