NTV Telugu Site icon

PM Narendra Modi: చైనాలో మోదీకి ముద్దు పేరు.. అసాధారణ నేత అంటున్న చైనీయులు

Pm Modi

Pm Modi

PM Narendra Modi: ప్రధాని మోదీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ప్రపంచ దిగ్గజ నాయకుల్లో ఒకరిగా ప్రశంసిస్తున్నారు. అయితే మనం శతృవుగా భావించే చైనాలో కూడా మోదీకి ఆదరణ పెరుగుతోంది. ఏకంగా మోదీకి ముద్దు పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. చైనా ప్రజల నుంచి ఇంతకుముందు ఏ విదేశీ నేతకు ఇంత ఆదరణ రాలేదు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఉన్నా.. చైనా ప్రజలు మాత్రం మోదీని అసాధారణ నేతగా పరిగణిస్తున్నారు.

Read Also: Deepak Chahar : ధోనీకి ఆఖరి సీజన్ అని ఎవరు చెప్పారు..?

తాజాగా అమెరికా పేపర్ ‘డిప్లొమాట్’ మోదీకి చైనా ప్రజల్లో ఉన్న మద్దతు గురించి వెల్లడించింది. దీనిపై ఓ కథనాన్ని ప్రచురించింది. మోదీ నాయకత్వంలో భారతదేశం, అగ్రదేశాలతో సమతూకం పాటిస్తోందని చైనా వ్యవహారాలను చూసే జర్నలిస్టు ము షుంషాన్ పేర్కొన్నాడు. చైనీయులు ప్రధాని మోదీని ‘ మోదీ లాక్షియన్’ అనే ముద్దుపేరుతో పిలుచుకుంటున్నారు. దీని అర్థం ఏంటంటే.. అసాధారణ సామర్థ్యమున్న వృద్దుడైన దివ్యపురుషుడు. మిగిలిన దేశాధినేతల కన్నా మోదీ భిన్నంగా ఉంటారని చైనీయులు భావిస్తున్నారు.

రష్యా, అమెరికా, వెస్ట్రన్ దేశాలతో మోదీ స్నేహంగా ఉంటారని చైనీయులు అభిప్రాయమని షుంషాన్ వెల్లడించారు. 20 ఏళ్లుగా అంతర్జాతీయ వార్తలను కవర్ చేస్తున్నానని, అయితే చైనీయులు ఓ విదేశీ నేతకు ఇలా ముద్దుపేరు పెట్టలేదని ఆయన అన్నారు. చైనాలో ట్విట్టర్ కు పోటీగా ఉన్న ‘సైనా విబో’లో మోదీ 2015లో చేరారు. ఆయనకు 2.44 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే చైనాతో ఘర్షణ నేపథ్యంలో చైనా యాప్ లపై 2020లో నిషేధం విధించింది భారత్. ఆ సమయంలో మోదీ విబో నుంచి నిష్క్రమించారు.