PM Modi: గురువారం బీజేపీ ఆఫీస్‌ను సందర్శించనున్న మోడీ

  • గురువారం బీజేపీ ఆఫీస్‌ను సందర్శించనున్న మోడీ
  • కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని
Pmmodi

Pmmodi

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం 7 గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని.. పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీ హెడ్‌ ఆఫీస్ దగ్గర బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మోడీ రాక కోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ఆ మజా వేరు.. ప్రెజర్ వుంది.. హనుమాన్ కన్నా ముందే డార్లింగ్ : హీరో ప్రియదర్శి ఇంటర్వ్యూ

ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ గవర్నర్‌మెంట్ నడుస్తోంది. ఈసారి సొంతంగా బీజేపీకి మెజార్టీ రాలేదు. దీంతో ఎన్డీఏ మిత్రపక్షాల సపోర్టుతో మోడీ 3.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఇండియా కూటమి కూడా బలంగానే ఉంది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని ధీటుగానే ఎదుర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి: Captain Anshuman Singh: “కీర్తిచక్ర”తో స్మృతి సింగ్ ఆస్ట్రేలియా పారిపోవాలని ప్లాన్.. అమరవీరుడి తండ్రి ఆరోపణ..

ఇక గురువారం బీజేపీ కార్యాలయానికి ప్రధాని మోడీ రావడంపై ఆసక్తిగా మారింది. కార్యకర్తలను ఉద్దేశించి ఏం ప్రసగించనున్నారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఈనెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 23న కేంద్రం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ.. కార్యకర్తలను కలవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.