Site icon NTV Telugu

PM Modi: ఉత్సాహంగా ఓటేసి.. కొత్త రికార్డ్‌ను సృష్టించండి.. బీహారీయులకు మోడీ పిలుపు

Modi

Modi

బీహార్‌లో ప్రస్తుతం రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో బీహార్ ఓటర్లకు ప్రధాని మోడీ కీలక విజ్ఞప్తి చేశారు. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొనాలని కోరారు. సరికొత్త రికార్డ్‌ను సృష్టించాలని విన్నవించారు. అలాగే మొదటి సారి ఓటు వేస్తున్న యువత.. ఓటు వేసి ఇతరులను కూడా ఓటు వేసేలా ప్రేరేపించాలని మోడీ విజ్ఞప్తి చేశారు.

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మొదటి విడతలో 121 స్థానాల్లో ఓటింగ్ జరగగా.. రెండో విడతలో 122 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి.

మలి విడతలో ‘సీమాంచల్’ పోలింగ్‌పై ప్రాధాన్యత సంతరించుకుంది. సీమాంచల్ అనగానే ఆర్జేడీకి కంచుకోటలాంటిది. ఇక్కడ ఆర్జేడీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 42 స్థానాల్లో విజయం సాధించగా.. ఆర్జేడీ 33, జేడీయూ 20, కాంగ్రెస్ 11, వామపక్షాలు 5 స్థానాల్లో విజయం సాధించాయి. ఇక 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిగా ఉన్నప్పుడు 80 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ కేవలం 36 స్థానాలకే పరిమితం అయింది. సీమాంచల్‌లో ఎక్కువుగా ముస్లింలు, యాదవ్‌లు ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలో మహాఘట్‌బంధన్ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది.

ఇది కూడా చదవండి: Shiva Sequel: నాగ చైతన్య-అఖిల్‌లో ‘శివ’ సీక్వెల్‌ ఎవరితో.. ఆసక్తికర సమాధానం ఇచ్చిన ఆర్జీవీ!

మలి విడతలో మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 3 కోట్ల 70 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఎన్నికల బరిలో 1,302 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా… ఇందులో ప్రత్యేకగా 136 మంది మహిళా అభ్యర్థులు ఉండటం విశేషం. 176 మందిని ఎన్నికల పరిశీలకులుగా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. అలాగే గట్టి పోలీస్ బందోబస్త్‌ను కూడా ఏర్పాటు చేసింది. దీపావళి, ఛత్‌ పండుగ కోసం బీహారీయులంతా సొంత గ్రామాలకు రావడంతో భారీగా పోలింగ్ నమోదవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎవరికి వారే విజయాలపై అంచనాలు వేసుకుంటున్నాయి.

 

Exit mobile version