కరోనాకు చెక్‌పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. భారత్‌లో వ్యాక్సినేషన్‌ను మరింత విస్తృతం చేసేందుకు విదేశీ వ్యాక్సిన్లకు సైతం అనుమతులు ఇస్తూ వస్తోంది భారత్.. ఇప్పటికే స్వదేశంలో తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్ అందుబాటులో ఉండగా.. రష్యా తయారు చేసిన స్పూత్నిక్ వీకు కూడా గ్రీన్ సిగ్నల్ రాగా.. తాజాగా.. అమెరికా కంపెనీ మోడెర్నా తయారు చేసిన వ్యాక్సిన్ దిగుమతితో పాటు అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది.. మోడెర్నా వ్యాక్సిన్‌ను ముంబైలోని ఫార్మాసూటికల్ కంపెనీ సిప్లా దిగుమతి చేసుకోనుంది. సోమవారమే ఈ సంస్థ దీనికోసం డీసీజీఐ అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోగా.. ఇవాళ గ్రీన్ సిగ్నల్ వచ్చింది.. మోడెర్నా అనేది మెసెంజర్ ఆర్ఎన్ఏ (ఎంఆర్ఎన్ఏ) వ్యాక్సిన్. ఇది కరోనా బాధితులపై 90 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు అధ్యయనాల్లో తేలింది.. దీంతో.. భారత్‌లో ఇప్పటికే మూడు వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా.. డీసీజీఐ తాజా నిర్ణయంతో.. నాల్గో వ్యాక్సిన్ కూడా రంగంలోకి దిగినట్టు అయ్యింది.
భారత్‌లో మోడెర్నా వ్యాక్సిన్ అత్యవసర వినియోగం..

Moderna