Site icon NTV Telugu

Raj Thackeray: రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. రాజ్ ఠాక్రేపై కేసు

Raj Thackeray

Raj Thackeray

ఔరంగాబాద్ ర్యాలీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఎంఎన్‌ఎస్‌ చీఫ్ రాజ్‌ ఠాక్రేపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ర్యాలీ నిర్వాహ‌కులైన మ‌రో ముగ్గురు పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు ఔరంగాబాద్ పోలీసులు. ఘ‌ర్షణ‌ల‌కు దారితీసేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశార‌ని రాజ్‌ఠాక్రేపై అభియోగాలు నమోదు చేశారు. మ‌సీదుల్లో లౌడ్‌స్పీక‌ర్ల‌ను తొల‌గించాల‌ని ఉద్ధవ్ ఠాక్రే స‌ర్కార్‌కు రాజ్‌ఠాక్రే అల్టిమేటం ఇచ్చారు. మే 3లోగా మ‌సీదుల్లో లౌడ్‌స్పీక‌ర్లు తొల‌గించాల‌ని ముంబై ర్యాలీలో ఆయ‌న మ‌హారాష్ట్ర స‌ర్కార్‌కు డెడ్‌లైన్ విధించారు. ఆ గ‌డువు ద‌గ్గర‌ప‌డటంతో… ఔరంగాబాద్‌ ర్యాలీలో ఉద్ధవ్‌ స‌ర్కార్‌పై విరుచుకుప‌డ్డారు రాజ్‌ఠాక్రే. 4వ తేదీలోగా మ‌సీదుల్లో లౌడ్‌స్పీక‌ర్లు తొల‌గించాల‌ని… లేకపోతే మ‌సీదుల ఎదుట భారీ శబ్ధాలతో హ‌నుమాన్ చాలీసా వినిపిస్తామ‌ని హెచ్చరించారు. మే 4 త‌ర్వాత ఎవ‌రేం చెప్పినా తాము వినిపించుకోమ‌న్నారు రాజ్‌ఠాక్రే.

Read Also: Rahul Gandhi Tour: రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డిపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు..

Exit mobile version