Site icon NTV Telugu

MLC Kavitha: కవితకు నో బెయిల్‌.. విచారణ ఆగస్టు 20 కి వాయిదా..

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: నేడు సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరిగింది. కవిత పిటిషన్ పై ఈడి సీబిఐ లకు నోటీసులు సుప్రీం కోర్టు జారీ చేసింది. కేసు తదుపరి విచారణ ఆగస్టు 20 కి వాయిదా వేసింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. లిక్కర్ ఈడి, సీబిఐ బెయిల్ కోసం ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కవిత పిటిషన్ ను జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వ నాథన్ ల ధర్మాసనం విచారించింది. కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గి హాజరయ్యారు. రోహిత్గి మహిళ, రాజకీయ నాయకురాలు. అయితే ఇవాళ సుమారు 463 సాక్షులను సుప్రీం కోర్టు ధర్మాసనం విచారించారు. ఐదు నెలల నుంచి కవిత జైల్లో ఉన్నారు.

Read also: IAS Smita Sabharwal: ఐఏఎస్ స్మితా సబర్వాల్ పై హైకోర్టులో పిటిషన్‌..

కాగా.. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు భావించింది. కానీ కవిత బెయిల్ పై సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురైంది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు నిరాశ చెందారు. సిసోడియాకు బెయిల్ మంజూరైన తరుణంలో.. సత్వర విచారణ హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను సుప్రీంకోర్టు ప్రస్తావించిన నేపథ్యంలో కవిత బెయిల్ అంశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపింది. పక్కాగా కవితకు సుప్రీం కోర్టులో బెయిల్ వస్తుందని అందరూ భావించారు. ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ అనంతరం ఆగస్టు 20కి వాయిదా వేసింది ధర్మాసనం. ఢిల్లి లిక్కర్ కేసులో కవితను మార్చి 15 న ఈడి, ఏప్రిల్ 11 న సీబిఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే..
Bandi Sanjay: బంగ్లాదేశ్ సంక్షోభ పరిస్థితుల ప్రభావం ఇక్కడ ఉండదు..

Exit mobile version