NTV Telugu Site icon

MK Stalin: మోదీజీ… హిందీలాగే తమిళాన్ని అధికార భాష చేయండి

Mk Stalin Pti Photo 2

Mk Stalin Pti Photo 2

ప్రధాని హైదరాబాద్ పర్యటన తరువాత ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లారు. దాదాపు రూ. 31,000 కోట్లతో 11 డెవలప్మెంట్ ప్రాజెక్టులకు సీఎం ఎంకే స్టాలిన్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల్లో పలు రోడ్డు, రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళనాడులో పర్యటిస్తున్న మోదీకి ఘన స్వాగతం పలికారు అక్కడి ప్రజలు.

ఇదిలా ఉంటే తమిళనాడు సీఎం స్టాలిన్, ప్రధాని మోదీకి కొన్ని విజ్ఞప్తులు చేశారు. ముఖ్యంగా హిందీ లాగే తమిళాన్ని అధికార భాష చేయాలని.. మద్రాస్ హైకోర్టులో తమిళాన్ని అధికార భాషగా చేయాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో తమిళమే మాట్లాడుతామని స్టాలిన్ అన్నారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళాన్ని అధికార, పరిపాలన భాషగా చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది.

మన మత్స్యకారులు స్వేచ్చా చేపలు పట్టేందుకు శ్రీలంక నుంచి కచ్చతీవు ద్వీపాన్ని తిరిగి పొందాలని ప్రధాని మోదీని కోరాడు. నీట్ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని, నీట్ పరీక్షను వ్యతిరేఖిస్తున్నామని ప్రధాని మోదీ ముందే స్టాలిన్ అన్నారు. కేంద్ర జీఎస్టీ బకాయిలు రూ. 14,006 కోట్లను రాష్ట్రాలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

తమిళనాడు ఆర్థిక వృద్ధి, గ్రామీణ ఆరోగ్య సౌకర్యాలు, విద్యా సంస్థలలో అగ్రగామి రాష్ట్రంగా ఉందని… ఆర్థిక అంశాల్లోనే కాకుండా సామాజిక న్యాయం, సమానత్వం, మహిళల ఉపాధిలో కూడా అగ్రగామిగా ఉందని ప్రధాని మోదీకి వివరించారు స్టాలిన్. దీనినే మేం ద్రావిడియన్ మోడల్ అంటామని అన్నారు.