CM MK Stalin Loses: సీఎం ఓడిపోయాడు.. తమిళ రాజకీయ చరిత్రలో సంచలనం
- తమిళ రాజకీయాల్లో పెను సంచలనం
- సొంత నియోజకవర్గంలో సీఎం స్టాలిన్ ఓటమి..
- 'దళపతి' పార్టీ అభ్యర్థి బాబు ఘనవిజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM MK Stalin Loses: తమిళనాడు రాజకీయ చరిత్రలో అరుదైన, అత్యంత సంచలనాత్మకమైన ఘట్టం నమోదైంది. గత పదిహేనేళ్లుగా ఎదురులేని నాయకుడిగా, సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎం.కె.స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో ఘోర పరాజయాన్ని చవిచూశారు. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) అభ్యర్థి వి.ఎస్. బాబు, ముఖ్యమంత్రి స్టాలిన్‌పై సుమారు 4,000 ఓట్ల ఆధిక్యంతో సంచలన విజయం సాధించారు. 2011 నుంచి వరుసగా మూడుసార్లు కొలత్తూరు నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్న స్టాలిన్‌కు ఓటర్లు ఈసారి షాక్ ఇచ్చారు. నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి పనుల కంటే, రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత, మార్పు కోరుకునే యువ ఓటర్ల నిర్ణయం స్టాలిన్ కొంపముంచినట్లు కనిపిస్తోంది. ఒక ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలోనే కొత్త పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
విజయ్ ‘విక్టరీ’ కేవలం సినిమాటిక్ కాదు..
ఈ ఫలితం ద్వారా ‘దళపతి’ విజయ్ రాజకీయ ప్రవేశం కేవలం ఒక గాలివాటం కాదని, అది ఒక శక్తివంతమైన ప్రభంజనమని రుజువైంది. టీవీకే పార్టీ అభ్యర్థి వి.ఎస్.బాబు అట్టడుగు స్థాయి నుంచి ప్రచారం నిర్వహించి, అధికార పార్టీ యంత్రాంగాన్ని ఎదిరించి గెలవడం గమనార్హం. ఈ ఓటమికి ప్రధాన కారణం.. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల మధ్యే సాగుతున్న అధికారాన్ని ఈసారి కొత్త శక్తికి అప్పగించాలని కొలత్తూరు ఓటర్లు నిర్ణయించుకోవడం అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మొదటిసారి ఓటు వేస్తున్న యువత, విద్యావంతులు విజయ్ నినాదాలకు ఆకర్షితులు కావడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తిని పసిగట్టడంలో డీఎంకే విఫలమవ్వడం, స్టాలిన్ ఓటమికి దారితీసిందని అంటున్నారు. ఈ చారిత్రక ఓటమితో తమిళనాడులో 50 ఏళ్ల ద్రవిడ రాజకీయాల గుత్తాధిపత్యానికి తెరపడి, ఒక నూతన రాజకీయ శకం మొదలైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చెపాక్ అసెంబ్లీ స్థానం నుంచి 4319 ఓట్ల మెజార్టీలో ఉన్నారు.
Also Read
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!