ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ లో ఫోక్ సింగర్ సరోజ్ సర్గం చేసిన పనికి హిందూ సంఘాలు అన్ని బగ్గుమంటున్నాయి. దుర్గామాత ఒక వేశ్య అంటూ పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మరికొద్ది రోజుల్లో దుర్గామాత నవరాత్రులు ప్రారంభవుతాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు భక్తులు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్‌కు చెందిన ఫోక్ సింగర్ సరోజ్ సర్గం చేసిన పనికి దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. దుర్గామాత ఒక వేశ్య అంటూ పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పొట్టు పొట్టు తిడుతున్నారు. లైవ్ సేషన్‌లో పాడుతున్న పాటలో హిందూ దేవతలను అవమానించింది.
విష్ణు మూర్తిని హంతకుడు అని.. దుర్గమ్మను వేశ్య అని.. ప్రహ్లాదుడిని తాగుబోతు అని వ్యాఖ్యానించింది. హిందూ ఆచారాలు, పండుగలను దారుణంగా అవమానింది. రిజర్వేషన్ల గురించి ప్రస్తావిస్తూ రాజకీయ నాయకులపై బూతులు తిట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ.. హిందువుల మనోభావాలు రెచ్చగొడుతున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
🚨 SHOCKER! Saroj Sargam INSULTS Maa Durga saying: “Durga r*ndi hai iski na tum Puja karo.”
— Such abuse of Hindu faith is UNACCEPTABLE. Strictest ACTION must be taken against her. pic.twitter.com/Sr7fjHTfOj
— Megh Updates 🚨™ (@MeghUpdates) September 19, 2025
