Site icon NTV Telugu

Kothagudem Airport: కొత్తగూడెంలో విమానాశ్రయం.. ఢిల్లీలో కేంద్ర‌మంత్రిని క‌లిసిన మంత్రి..

Tummala Nageshwer Rao

Tummala Nageshwer Rao

Kothagudem Airport: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి వినతిపత్రం సమర్పించారు. కాగా, కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. నాటి ప్రభుత్వం టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతంలో నిర్మించిన విమానాశ్రయ భూములకు స్థలం క్లియరెన్స్ ఇవ్వాలని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు నివేదికలో ప్రభుత్వాన్ని కోరారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కూడా సానుకూల నివేదిక ఇవ్వడంతో విమానాశ్రయం ఏర్పాటుపై జిల్లా ప్రజల చిరకాల వాంఛకు తీరనుంది.
Mahabubabad: విద్యార్థిని పట్ల వార్డెన్ అసభ్య ప్రవర్తన.. దేహశుద్ది చేసిన కుటుంబ సభ్యులు..

Exit mobile version