కరోనా సమయంలో.. వరుసగా పరీక్షలను రద్దు చేయడం, వాయిదా వేయాల్సిన పరిస్థితి… కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలోనూ.. ఇదే పరిస్థితి ఎదురైంది… అయితే.. ఈ నెల 17న అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులతో సమావేశంకానున్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ . విద్యారంగంపై కరోనా ప్రభావంపై సమీక్షించనున్నారు. వర్చువల్ విధానంలోనే జరిగే సమావేశంలో ఆన్‌లైన్ ఎడ్యూకేషన్‌ను ప్రోత్సహించడం, నూతన జాతీయ విద్యా విధానం అమలుపై సమీక్ష జరుపనున్నారు. కాగా, కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఇలాంటి సమావేశాలు నిర్వహించినా.. సెకండ్ వేవ్ తర్వాత రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. కరోనా సమయంలో.. క్లాసుల నిర్వహణ.. ఎలా ఉండాలి.. ఇప్పటికే ఆన్‌లైన్ విద్యతో ఎదురవుతోన్న సమస్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశంఉంది..
విద్యాశాఖ కార్యదర్శులతో భేటీకి కేంద్ర విద్యాశాఖ మంత్రి రెడీ..
Ramesh Pokhriyal