NTV Telugu Site icon

Minister Ktr: నేడు, రేపు హస్తినలోనే కేటీఆర్‌.. ఢిల్లీలో న్యాయ నిపుణులతో భేటీ

Ktr Kavitha

Ktr Kavitha

Minister Ktr: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నేడు కవితను ఈడీ విచారించనుంది. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మరోవైపు మంత్రి కేటీఆర్ తన సోదరి కవిత కోసం నిన్న ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. నేడు, రేపు కేటీఆర్ ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీలోని న్యాయ నిపుణులతో భేటీ కానున్నారు. మద్యం కుంభకోణంలో వంద కోట్ల అవినీతి ఆరోపణలపై కవిత, అరుణ్ రామచంద్ర పిళ్లై, ఆడిటర్ బుచ్చిబాబులను ఏకకాలంలో విచారించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సౌత్ గ్రూపులో ఈ ముగ్గురే కీలకపాత్ర పోషించారనే ఆరోపణలున్నాయి. దీంతో విచారణ అనంతరం కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కవితకు నైతిక మద్దతు ఇచ్చేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై న్యాయ నిపుణులతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. కవితకు లాయర్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Read also: NTR30: NTR30 నుంచి డబుల్ ధమాకా.. అదొక్కటే ఆలస్యం

కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడి నుంచి కల్వకుంట్ల కవిత సమన్లు అందుకున్న విషయం తెలిసిందే. ఇవాల ఉదయం 10 గంటల తర్వాత తుగ్లక్ రోడ్డు నివాసం నుంచి ఈడీ ఆఫీస్ కు కవిత బయలుదేరనున్నారు. దీంతో ఢిల్లీలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. అబ్దుల్ కలాం రోడ్ లోని ED ఆఫీస్ పరిధిలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈడీ కవితను ఎంత సేపు విచారించనుంది. ఆతరువాత పరిణామాలు ఎలాఉంటాయనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠత నెలకొంది.
Banana : అరటిపండు తినేముందు ఒక్కసారి ఆలోచించుకోండి