NTV Telugu Site icon

Mehbooba Mufti: రాజద్రోహం కేసులు పెడితే… ఇండియా మరో శ్రీలంక అవుతుంది

Mahbooba Mufti

Mahbooba Mufti

రాజద్రోహం చట్టంపై సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజద్రోహం చట్టంపై సుప్రీం కోర్ట్ స్టే విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజద్రోహ చట్టం నిబంధనలను కేంద్ర హోం శాఖ పున: సమీక్షించే వరకు రాజద్రోహం కింద కేసులు నమోదు చేయవద్దని కేంద్ర , రాష్ట్రాలను ఆదేశించింది. రాజద్రోహ చట్టం 124ఏ కింద ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే ఈ కేసు కింద శిక్ష అనుభవిస్తున్న వారు బెయిల్ పిటిషన్ పెట్టుకోవచ్చని తెలిపింది సుప్రీం కోర్ట్.

ఇదిలా ఉంటే ఈ చట్టంపై పలువురు రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీఎఫ్ పార్టీ చీఫ్ మహబూబా ముఫ్తీ స్పందించారు. ప్రస్తుతం మన దేశంలో హక్కులపై మాట్లాడే వారిపై రాజద్రోహం కేసులు పెడుతున్నారని.. అక్బర్ అని రాసిన వారిపై కూడా కేసులు పెడుతున్నారని మహబూబా ముఫ్తీ ఆరోపించారు. విద్యార్ధులు, హక్కుల కార్యకర్తలు మాట్లాడినా రాజద్రోహం కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు.

ఇలాగే మనదేశంలో విద్యార్థులు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలపై రాజద్రోహం కేసులు పెట్టుకుంటూ పోతే వచ్చే రోజుల్లో ఇండియా కూడా శ్రీలంకల తయారవుతుందని అన్నారు. శ్రీలంకలో జాతీయవాదం పేరిట బౌద్దులు, క్రిస్టియన్స్, ముస్లిం మధ్య ఘర్షణ ఏర్పడుతోందని… ఇలాంటి పరిస్థితులు కూడా ఇండియాలో వచ్చే అవకాశం ఉందని మహబూబా ముఫ్తీ అన్నారు. అధికార బీజేపీ పార్టీ శ్రీలంక పరిస్థితుల నుంచి బుద్ధి తెచ్చుకుంటుందని… మతపరమైన ఉద్రిక్తతలను, మెజారిటీ వాదాన్ని ఆపాలని ఆమె కొరారు.