ఒమిక్రాన్ ఎంట్రీ తర్వాత భారత్‌లో కోవిడ్ పంజా విసురుతోంది.. రోజుకో రికార్డు తరహాలో కేసులు మళ్లీ భారీ సంఖ్యలో పెరుగుతూ పోతున్నాయి.. ఇదే సమమంలో.. సామాన్యుల నుంచి వీఐపీల వరకు ఎవ్వరినీ వదలడం లేదు మహమ్మారి.. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కోవిడ్ సోకుతుంది.. మరికొందరు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా కోవిడ్ బారినపడుతున్నారు.. ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధులను కోవిడ్ పలకరించింది.. కేంద్ర మంత్రులు, సీఎంలు, రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతులు చాలా మంది కరోనా బారినపడగా.. తాజాగా, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా కూడా కరోనా సోకింది..
ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు సంగ్మా.. కొన్ని రోజులుగా తనకు స్వల్ప అస్వస్థత, స్వల్ప లక్షణాలు కూడా ఉండడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నానని.. కోవిడ్‌గా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్న ఆయన.. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపారు.. ఇక, తనను ఈ మధ్య కాలంలో కలిసిన వారంతా కరోనా టెస్ట్‌లు చేయించుకోవాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, సీఎం కాన్రాడ్ సంగ్మా.. ఇప్పుడు కోవిడ్ బారినపడడం రెండోసారి.. 2020లో తొలిసారి కరోనా పాజిటివ్‌గా తేలగా.. థర్డ్ వేవ్ సమయంలో.. మరోసారి పలకరించింది కరోనా. అయితే, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత రోజే ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది..