Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mayawati: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి మరోసారి సంచలన నిర్ణయంతో రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేశారు. పార్టీలో కుటుంబ పాలనకు తావులేదని నినదిస్తూనే.. తన సోదరుడు ఆనంద్ కుమార్ కుమారులను రాజకీయ బాధ్యతలకు శాశ్వతంగా దూరం పెడుతున్నట్లు కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో ఆయన కుమార్తె, న్యాయవిద్య అభ్యసిస్తున్న కుమారి దీపికా ఆనంద్‌కు కీలక బాధ్యతలు అప్పగించే సూచనలు ఇవ్వడం ద్వారా సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపారు.
కొడుకులకు దక్కని పగ్గాలు.. తెరపైకి కుమారి దీపిక
బీఎస్పీని కుటుంబ పాలన జాడ్యం నుంచి కాపాడటమే తన పరమ లక్ష్యమని మాయావతి స్పష్టం చేశారు. అవివాహితురాలినైన తనకు భద్రత అవసరాల రీత్యా తోడుగా ఉన్న సోదరుడు ఆనంద్ కుమార్ కుమారులెవరికీ.. బీఎస్పీలో చిన్న, పెద్ద ఎలాంటి పదవులూ ఇచ్చే ప్రసక్తే లేదని ఆమె తేల్చిచెప్పారు. అంతేకాదు, భవిష్యత్తులో వారి సంతానానికి కూడా పార్టీలో స్థానం ఉండదని కఠిన నిబంధన విధించారు. అయితే ఆనంద్ కుమార్‌కు సాయం చేసే నెపంతో ఆయన కుమార్తె దీపికా ఆనంద్ రాజకీయ అరంగేట్రానికి మాత్రం పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిజాయితీ, విధేయత, పనితీరు ఆధారంగా ఆమెకు బాధ్యతలు కట్టబెట్టవచ్చని, ఒకవేళ దీపిక అందుకు ముందుకు రాకపోతే బహుజన్ సమాజానికి చెందిన నిబద్ధత కలిగిన మిషనరీ కార్యకర్తకే ఆ అవకాశం దక్కుతుందని వెల్లడించారు.
Also Read
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
జెన్-జీ, జెన్-ఆల్ఫాపై దృష్టి.. 50 శాతం యువతకే పెద్దపీట
రాబోయే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త తరం యువ నాయకత్వాన్ని తెరపైకి తీసుకురావడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నట్లు మాయావతి తెలిపారు. జెన్-జీ, జెన్-ఆల్ఫా ఆలోచనలకు అనుగుణంగా పార్టీలో 50 శాతం మేర సంస్థాగత బాధ్యతలను యువతకే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యాంగ విలువలు, అంబేడ్కర్‌వాద సిద్ధాంతాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే కొత్త తరాన్ని నిర్మించడమే తన సంకల్పమని పేర్కొన్నారు. నాలుగు సార్లు బీఎస్పీ సాగించిన సుపరిపాలనలో రోడ్లు, తాగునీరు, విద్య, ఉపాధి, రక్షణ రంగాల్లో మైలురాళ్ళు సాధించామని, పల్లెల నుంచి వలసలను అడ్డుకున్నామని మాయావతి గుర్తుచేశారు. 2012లో విపక్షాలు సాగించిన కులతత్వ రాజకీయాల కారణంగానే బీఎస్పీ ఓటమి చవిచూడాల్సి వచ్చిందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో చట్టబద్ధ పాలన అటకెక్కిందని, బీఎస్పీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు ప్రత్యర్థులు ‘సామ, దాన, భేద, దండోపాయాలు’ ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు.
క్రమశిక్షణారాహిత్యం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా బయటకు పంపిన నేతలను తిరిగి పార్టీలోకి చేర్చుకుంటున్నారంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆమె పూర్తిగా కొట్టిపారేశారు. అదంతా తప్పుడు ప్రచారమని, క్రమశిక్షణ ఉల్లంఘించిన ఏ ఒక్కరికీ బీఎస్పీ తలుపులు తిరిగి తెరుచుకోవని తేల్చిచెప్పారు. అంబేడ్కర్‌వాద ఆశయ సాధనకు కార్యకర్తలు పూర్తి శక్తితో పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!