Site icon NTV Telugu

X Outage: “ఎక్స్” సేవల్లో అంతరాయం..

X

X

X Outage: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘‘ఎక్స్’’ శనివారం తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొంది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కంటెంట్ పోస్టింగ్‌లో అంతరాయం ఎదురైనట్లు యూజర్లు పేర్కొన్నారు. ఈ అంతరాయంపై డౌన్‌డిటెక్టర్ 2,100 కి పైగా సమస్యలను నివేదించింది. వినియోగదారులు సైన్ ఇన్ చేయడంలో ఇబ్బంది పడటంతో పాటు నేరుగా సందేశాలను అందుకోకపోవడం వంటి వివిధ సమస్యలను ఎదుర్కొన్నారు. అనేక మంది వినియోగదారులు తమ లింక్స్ తెగిపోయినట్లు నివేదించారు. లాగిన్ అవ్వడం, కొత్త పోస్టులు లోడ్ చేయడం వంటి సమస్యల్ని యూజర్లు ఎదుర్కొన్నారు. యాప్, వెబ్‌సైట్ రెండు ఈ అంతరాయానికి ప్రభావితమైనట్లు తెలుస్తోంది.

Exit mobile version