Ayodhya: అయోధ్య యజ్ఞశాలలో భారీ అగ్నిప్రమాదం.. ఎకరం విస్తీర్ణం దగ్ధం
- అయోధ్య యజ్ఞశాలలో భారీ అగ్నిప్రమాదం
- ఎకరం విస్తీర్ణం దగ్ధం
- ఎవరికీ ప్రమాదం జరగలేదన్న యూపీ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్యలోని యజ్ఞశాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజ్‌ఘాట్‌లో బటి బాబా ఆశ్రమం సమీపంలో ఉన్న మహాలక్ష్మి నారాయణ యజ్ఞశాలలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద పెద్ద పందిళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. 10 అగ్నిమాపక వాహనాలు రెండు గంటల్లోనే మంటలను అదుపులోకి తెచ్చాయి.

Also Read
- Parliament Session: పార్లమెంట్లో నేడు కీలక బిల్లులు.. పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లుపై చర్చ.!
- Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
- NTA Exam Reform: పరీక్షా సంస్కరణల హైపవర్ కమిటీ సభ్యులు వీరే..
- PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..
అగ్ని ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని ఉత్తర ప్రదేశ్ రవాణా శాఖ మంత్రి దయాశంకర్ సింగ్ అన్నారు. మార్చి 20 నుంచి మార్చి 28 వరకు యజ్ఞం జరిగిందని.. తొమ్మిది రోజుల పాటు జరిగిన మహాయజ్ఞం ముగిశాక ఈ అగ్నిప్రమాదం జరిగిందని వెల్లడించారు. యజ్ఞశాల ఖాళీగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని.. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. కానీ లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు చెప్పారు. దాదాపు ఎకరం విస్తీర్ణంలో ఉన్న యజ్ఞశాల నిమిషాల వ్యవధిలోనే బూడిదైపోయింది. ఈ భారీ అగ్నిప్రమాదం రామ మందిరానికి కేవలం 800 మీటర్ల దూరంలో జరిగింది.

శనివారం ఉదయం సుమారు 11:30 గంటలకు పూర్ణాహుతితో యజ్ఞం ముగియగానే.. భక్తులు ఇళ్లకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం తర్వాత ఈ ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదని, దర్యాప్తు చేసేందుకు ఒక సాంకేతిక బృందాన్ని పంపుతామని మంత్రి తెలిపారు. యంత్రాంగం ఈ విషయంపై దర్యాప్తు చేస్తోందని, అసలు కారణం త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు.
अयोध्या के राजघाट स्थित बाटी बाबा आश्रम के पास महालक्ष्मी नारायण यज्ञशाला में अचानक भीषण आग लगने से हड़कंप मच गया. गनीमत रही कि हादसे में कोई जनहानि नहीं हुई, हालांकि आग से लाखों रुपये के नुकसान की आशंका जताई जा रही है.#Ayodhya pic.twitter.com/RT3ersQxRk
— NDTV India (@ndtvindia) March 28, 2026
తాజావార్తలు
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Varanasi: మహేష్ ‘వారణాసి’కి కీరవాణి మ్యూజిక్ మ్యాజిక్.. సెప్టెంబర్ నుంచి అసలు పని!
-
Vivo X300e: వివో X300e విడుదల.. 7,200mAh భారీ బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్
-
Cinema : నిర్మాతలకు బల్గేరియా బంపర్ ఆఫర్!
-
Hyderabad: డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు దూసుకెళ్లిన యువకుడు.. కానిస్టేబుల్‌కు కాలు ఫ్రాక్చర్.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!
-
iPhone 18 Pro, Pro Max ఫుల్ డీటెయిల్స్ లీక్.. లాంచ్ అప్పుడే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!