NTV Telugu Site icon

Fire Accident: వారణాసి రైల్వేస్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 200 బైక్స్

Fire Accidenty

Fire Accidenty

Fire Accident: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 200 బైక్స్ కాలి బూడిదయ్యాయి. ఈ రోజు (నవంబర్ 30) తెల్లవారుజామున ఈ ఘటన నెలకొంది. ఈ ప్రమాదంపై అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వారణాసి రైల్వే స్టేషన్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం రావడంతో.. తక్షణమే జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌, స్థానిక పోలీసులతో పాటు 12 ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ట్రై చేశాయి.

Read Also: Cyclone Fengal: ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. విద్యాసంస్థలు బంద్‌, విమాన రాకపోకలకు అంతరాయం

అయితే, దాదాపు రెండు గంటలు శ్రమించి మంటలను ఆగ్నిమాపక శాఖ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చింది. కాగా, ఈ ఘటనలో దాదాపు 200 ద్విచక్ర వాహనాలు కాలి బూడిద అయిపోయాయి. దగ్ధమైన వాహనాల్లో రైల్వే అధికారులకు చెందినవే ఎక్కువగా ఉన్నట్లు స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Show comments