NTV Telugu Site icon

Karnataka video: ఇళ్ల మధ్యకు వచ్చేసిన భారీ కింగ్ కోబ్రా.. బెంబేలెత్తిపోయిన ప్రజలు

Kingcobra

Kingcobra

మామూలుగా చిన్న.. చిన్న పాములు కనిపిస్తేనే.. గుండెలు జారుకుంటాయి. అవి కనబడితేనే.. కొంత మందికి చెమటలు పడుతుంటాయి. అలాంటిది 12 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా ప్రత్యక్షమైతే ఇంకెలా ఉంటుంది. అలాంటి దృశ్యమే కర్ణాటక వాసులకు కళ్ల ముందు ఆవిష్క్రతమైంది. దాన్ని చూసిన ప్రజలు హడలెత్తిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఇది కూడా చదవండి: Allu Family Vs Mega Family: అల్లు అర్జున్ నంద్యాల ప్రచారం.. మెగా ఫ్యామిలీతో వివాదంలో నిజమిదే!

కర్ణాటకలోని అగుంబేలో ఒక ఇంటి దగ్గరకు పొడవైన కింగ్ కోబ్రా వచ్చి చెట్టు పొదల్లో చిక్కుకుంది. అక్కడ నుంచి బుసలు కొడుతోంది. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. దీంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు.. చాకచక్యంగా బ్యాగ్‌లో బంధించి.. దూరంగా అటవి ప్రాంతంలో విడిచిపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను అగుంబే రెయిన్‌ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ (ARRS)లోని ఫీల్డ్ డైరెక్టర్ అజయ్ గిరి ఆన్‌లైన్‌లో పంచుకున్నాడు. అజయ్‌నే రెస్క్యూ ఆపరేషన్ చేసి కింగ్ కోబ్రాను బంధించాడు. ఇది భారీ కింగ్ కోబ్రా అని అజయ్ పేర్కొ్న్నాడు. ఆ కోబ్రోను మీరు కూడా చూసేయండి.

ఇది కూడా చదవండి: Dubai: దుబాయ్‌లో ప్రమాదకరంగా హీట్‌వేవ్.. యూఎస్ సైంటిస్టుల ఆందోళన