Site icon NTV Telugu

INDIA Bloc-EC: రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో ఈసీ ఆఫీస్‌కు మార్చ్.. పాల్గొన్న విపక్ష ఎంపీలు

Ecinidabloc

Ecinidabloc

ఎన్నికల సంఘంపై ఇండియా కూటమి యుద్ధానికి దిగింది. గత కొద్ది రోజులుగా ఓట్ల చోరీపై విపక్షాలు ఆందోళనలు, నినసనలు కొనసాగిస్తున్నాయి. బీహార్‌లో అధికార పార్టీకి తొత్తుగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందంటూ పార్లమెంట్ వేదికగా విపక్ష పార్టీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం కార్యాలయం ముట్టడికి బయల్దేరారు. పార్లమెంట్ భవనం నుంచి ఈసీ ఆఫీసుకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ మార్చ్ నిర్వహిస్తున్నారు. అయితే విపక్షాల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎంపీలు బారీకేడ్లు దాటుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నిస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన గోల్డ్ రేట్స్

త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా 65 లక్షల ఓట్లను తొలగించింది. దీంతో విపక్షాలు ధ్వజమెత్తాయి. అధికార పార్టీకి మద్దతుగా ఎన్నికల సంఘం ఓట్లు తొలగించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండిస్తోంది. తనిఖీలు చేశాకే ఓట్లు తొలగించినట్లు చెప్పింది.

ఇది కూడా చదవండి: Asim Munir: భారత్‌పై పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మూర్ఖపు వ్యాఖ్యలు.. అవసరమైతే…!

 

Exit mobile version