NTV Telugu Site icon

దండ‌కార‌ణ్యం బంద్‌కు మావోయిస్టుల పిలుపు

Maoists

దండ‌కార‌ణ్యం బంద్‌కు పిలుపునిచ్చారు మావోయిస్టులు.. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దక్షన్ సబ్ జోనల్ బ్యూరో పేరిట లేఖ విడుద‌ల చేసిన మావోయిస్టులు.. సీలింగేర్ మారణకాండకు వ్యతిరేకంగా నిరసన, ప్రతి ఘటనన‌లు కొన‌సాగుతాయ‌ని ప్ర‌క‌టించారు.. బస్తర్ డివిజన్ నుండి పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలని కోరుతూ ప్రజా ఉద్యమాన్ని తీవ్రం చేయాల‌ని లేఖ‌లో పిలుపునిచ్చిన మావోలు.. జూన్ 5న దండకారణ్యం ఛత్తీస్‌గడ్ గడ్చిరోలి బంద్‌ను విజయవంతం చేయాల‌ని కోరారు.. ఇక‌, కేంద్రంలోని బ్రాహ్మణీయ, హిందుత్వ ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం, ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రంలోని ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అమలు చేస్తున్న ఆదివాసి ప్రజావ్యతిరేక పోలీస్ క్యాంపులను తీవ్రంగా ఖండించాల‌ని పిలుపునిచ్చారు.. మే 17న సీలింగేర్ మారణకాండకు బాధ్యులైన బస్టర్ ఐజి సుందర్ రాజ్ ఇతర పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖ‌లో డిమాండ్ చేశారు మావోయిస్టులు.