Site icon NTV Telugu

Jharkhand: జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్.. మావో అగ్ర నేత హతం

Maoistpappulohara

Maoistpappulohara

దేశంలో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్ర నేత బసవరాజు హతమయ్యాడు. ఇతడిపై రూ.కోటికి పైగా రివార్డు ఉంది. తాజాగా శనివారం జార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో అగ్ర నేత పప్పు లోహారా హతమయ్యాడు. ఇతడిపై రూ.10 లక్షల రివార్డు ఉంది. ఇతడు జార్ఖండ్ జన ముక్తి పరిషత్ అనే తిరుగుబాటు మావోయిస్టు సంస్థకు నాయకుడిగా ఉన్నాడు.

ఇది కూడా చదవండి: ‘Maa Inti Bangaram’ : జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న సమంత..

శనివారం జార్ఖండ్‌లోని లతేహార్‌లో భద్రతా దళాలు ఒక సీనియర్ మావోయిస్టు నాయకుడు పప్పు లోహారాను హతమార్చాయని పోలీస్ వర్గాలు తెలిపాయి. మరో రూ.5లక్షల రివార్డు ఉన్న లోహారా సహాయకుడు ప్రభాత్ గంజుతో కలిసి ప్రాణాలు కోల్పోయాడు. ఇక గాయపడ్డ మరొక సభ్యుడ్ని అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఐఎన్‌ఎస్‌ఏఎస్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Rajanna Siricilla: బైకులోకి దూరిన పాము.. పార్ట్స్ అన్నీ ఊడదీసినా.. చివరకు

మార్చి 2026 నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిజ్ఞ చేశారు. బసవరాజు ఎన్‌కౌంటర్‌ను నక్సలిజాన్ని నిర్మూలించే యుద్ధంలో ఒక మైలురాయి విజయంగా అభివర్ణించారు. భద్రతా దళాల ధైర్యసాహసాలను ప్రశంసించారు.

ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ కాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు ప్రాణాలు కోల్పోయారు.

Exit mobile version