Site icon NTV Telugu

Maharashtra: సీఎం ఫడ్నవిస్ ఎదుట లొంగిపోయిన మల్లోజుల.. ఆయుధాలు అందజేత

Maharashtra3

Maharashtra3

మావోయిస్ట్ అగ్ర నేత మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎదుట లొంగిపోయారు. గడ్చిరోలిలో 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయారు. ముఖ్యమంత్రికి ఒక్కొక్కరిగా వచ్చి ఆయుధాలు అందజేశారు. ఇటీవల కేంద్రమంత్రి హోంమంత్రి అమిత్ షా హెచ్చరికలు జారీ చేశారు.. 2026 మార్చి నాటికి మావోలు లేని దేశంగా మారుస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో చేసేదేమీలేక 44 ఏళ్ల అజ్ఞాతవాసానికి మల్లోజుల వేణుగోపాల్ తెర దించారు. జనజీవనసవ్రంతిలో కలిసి పోవాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో 60 మంది సభ్యులతో కలిసి మంగళవారం లొంగిపోయాడు. ఇక అధికారికంగా బుధవారం ఫడ్నవిస్ ఎదుట మల్లోజుల లొంగిపోయాడు. మల్లోజులను ఫడ్నవిస్ పక్కన నిలబెట్టుకుని ఫొటో దిగారు.

ఇది కూడా చదవండి: Maharashtra: సీఎం ఫడ్నవిస్ ఎదుట లొంగిపోయిన మల్లోజుల.. ఆయుధాలు అందజేత

మల్లోజులపై మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణలో అనేక కేసులు ఉన్నాయి. 100కు పైగా కేసులు ఉన్నాయి. మావోయిజంలో మల్లోజులది 44 ఏళ్ల ప్రస్థానం. ఇతడిపై రూ.6 కోట్ల రివార్డు ఉంది. ఆయుధాలను అప్పగించడంతో ముఖ్యమంత్రి ఫడ్నవిస్ వారికి రివార్డు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Ravi Naik: గోవా మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ కన్నుమూత.. మోడీ సంతాపం

Exit mobile version