Manipur Governor: నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. మణిపూర్ గవర్నర్ లా. గణేశన్‌కు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ధన్‌కర్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ శనివారం ప్రకటించింది. ‘పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా శ్రీ జగదీప్ ధన్‌ఖర్ చేసిన రాజీనామాను భారత రాష్ట్రపతి ఆమోదించారు’ అని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది.
Read Also:
Presidential Poll 2022: నేడే రాష్ట్రపతి ఎన్నిక.. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్
పశ్చిమ బెంగాల్ గవర్నర్ విధులను నిర్వర్తించేందుకు మణిపూర్ గవర్నర్ లా. గణేశన్‌ను నియమించడం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు, ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి సాధారణ ఏర్పాట్లు జరిగే వరకు తన సొంత విధులకు అదనంగా ఈ విధులను నిర్వహించాల్సి ఉంటుంది. బెంగాల్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించి గణేశన్ తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6న జరగనుంది. జగదీప్ ధన్‌కర్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. విపక్షాలు ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు మార్గరెట్ అల్వాను ఎన్నుకున్నాయి.