Site icon NTV Telugu

Honeymoon Murder: భర్తని చంపిన కేసులో, సోనమ్‌ను పట్టించిన ‘‘మంగళసూత్రం’’..

Sonam

Sonam

Honeymoon Murder: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పెళ్లయి రెండు వారాలు గడవకముందే భర్తను భార్య దారుణంగా చంపించింది. ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీని, అతడి భార్య సోనమ్ పక్కా పథకంలో హతమార్చింది. సోనమ్ ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా ఈ కేసులో ప్రధాన సూత్రధారులు. వీరిద్దరు ముగ్గురు కిరాయి హంతకులను నియమించుకున్నారు.

Read Also: UPI payments: “యూపీఐ లావాదేవీల”పై తప్పుడు ప్రచారం.. కేంద్రం సీరియస్ వార్నింగ్..

అయితే, ఈ కేసులో సోనమ్‌ని ‘‘మంగళసూత్రం’’ పట్టించింది. సోనమ్ దంపతులు బస చేసిన హోమ్ స్టే గదిలో మేఘాలయ పోలీసులు సోదా చేస్తున్న సమయంలో నిందితురాలి తాళి దొరికింది. దీంతో పోలీసుల దర్యాప్తును మరో కోణంలోకి తీసుకెళ్లింది. హోమ్ స్టే బయటకు వెళ్లిన రోజు, అంటే రాజా రఘువంశీ హత్య జరిగిన మే 23న సోనమ్ తన తాళిని, ఉంగరాన్ని గదిలోనే వదిలేసి వెళ్లినట్లు డీఐజీ డీఎన్ఆర్ మారక్ చెప్పారు.

కొత్తగా పెళ్లయిన మహిళ హోమ్ స్టేలో తాళిని, సూట్‌కేస్‌లో ఉండరాన్ని మరిచి వెళ్లడం మాకు సందేహాన్ని కలిగించిందని, ఒక స్త్రీ తన హనీమూన్ సమయంలో తాళిని ఎలా వదిలేయగలదు..? అని పోలీసులు అనుమానించారు. తాము క్షుణ్ణంగా, వివరాణాత్మక దర్యాప్తు చేశామని, నిందితులు తమ ప్రమేయాన్ని అంగీకరించారని మేఘాలయ పోలీసులు చెప్పారు.

Exit mobile version